కొందరితో మొదలై
అందరిదయింది.
త్యాగం,సేవ,ధర్మం మూలసూత్రాలను పునాదిగా చేసుకొని,
క్రమశిక్షణ,సిద్ధాంతాలకు నెలవైంది.
దేశానికి వెన్నుదన్నై నిలిచి,
ప్రపంచప్రఖ్యాతి నొందిందింది.
భరతమాత చేతి కాషాయపతాకమై,
భారతదేశ చరిత్రలో శతమానమై,
దినదినప్రవర్థమానమై నిలిచింది.
ప్రజాస్వామ్యానికి ఛత్రమై,
వ్యక్తిపూజకు దూరమై,
సామాన్యులకు అండ,దండలుగా ఉండి ధైర్యాన్ని నింపింది.
హిమాలయ శిఖర గౌరవమై,
జనమేజయమై వెలిగింది.
సనాతనధర్మానికి తావై,
కర్తవ్యనిర్వహణకు తార్కాణమై మెరిసింది.
సుసైన్యమై,స్వాభిమాన సాదృశ్యమై స్థాపితమైంది.
ధైర్య,సాహాసాలకు,వినయ,
విధేయతలకు దర్పణమైంది.
ఒడిదుడుకులను చిరునవ్వుతో అధిగమించి,
దేదీప్యమానమై కనబడుతున్నది.
మహనీయుల మార్గదర్శకంలో బలోపేతమై జాతిజాగృతికి కంకణం కట్టుకున్నది.
మాతృభక్తియుక్తమై,అమృతప్రాయమై విశ్వరూపాన్ని సంతరించుకున్నది.
ఆర్.ఎస్.ఎస్. అద్వితీయమై,ప్రత్యామ్నాయం లేని సేవాసంస్థగా వేళ్ళూనుకుపోయింది.
వేనవేలసంవత్సరాల ఆయుర్దాయంతో,
భరతజాతి భవితకు దిక్సూచి పట్టనుంది.
సంవిధానంతో స్నేహం,
అఖండభారత లక్ష్యంతో,
తనకు తాను పురుడు పోసుకుంటూ,
నిత్యనూతనమై,నిస్వార్థ గమనంతో పయనం కొనసాగిస్తూనే ఉంటుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి