కల్తీ : -Dr c వసుంధర-చెన్నై

 కల్తీ ఇదొక వింత శాల్తి 
గీతలో కృష్ణుని  స్టైల్లో తన విశ్వరూపం చూపిస్తుంది.
పువ్వులో, మన నవ్వులో ఇందుగలడందు లేదని
డౌటే వలదనుచు దర్శన మిచ్చున్.

 "బియ్యం లో బియ్యమై,  పప్పులో పప్పునై ,ఉప్పులో ఉప్పుగా, వ్యాపారుల కాలి కింద చెప్పునై నేనెప్పుడూ ఉండిపోతా! ఈ ధరలో
ఎప్పటికీ నిండి ఉంటా
  ధరలు పెంచి దగ దగ
మెరిసిపోతా." అని అది అంటుంటే మనం వింటుంటే  కాలమే గడిచిపోదా  హాస్పిటల్స్ నిండి పోవా? కల్తీ మాత్రం హాయిగా ఉండి పోదా!
😂😂😂
కామెంట్‌లు