శజ్ఞ్కర భగవత్పాదులు - కనకధారా స్తోత్రం:- నాగరాజకుమార్ .MVSS-8897 839 185 -9963 936 021
 ఓం వ్యుప్తకేశాయ నమః
 
ఓం గానలక్ష్మ్యై నమః
ఓం శృంగార లక్ష్మ్యై నమః
ఓం ధనలక్ష్మ్యై నమః
 
 
శ్లోకం:
విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్ష -
మానందహేతురధికం మురవిద్విషోపి |
ఈషన్నీషదతు మయి క్షణమీక్షణార్థ -
మిందీవరోదరసహోదరమిందిరాయాః.           || 3 ||*
 
తా.:సమస్త దేవతలకు అన్ని శుభాలను ఇచ్చేది; ముర రాక్షసుని శతృవైన శ్రీహరి కి ఆనందాన్ని కలిగించేది; సోదరుడు అయిన చందృని సన్నహితులైన నల్ల కలువలను సింహాసనము గా కల దియు అయిన లక్ష్మీ దేవి

కరుణా పూరిత చూపులు నాపై ఎల్లప్పుడూ నిలిచి యుండును గాక !
 
భావము:
అమ్మా! నీవు ముప్పది కోట్ల దేవతలకు, వారు కోరిన కోరికలు తీర్చి, అన్ని శుభములు ఇచ్చే దానివి. ముర అనే రాక్షసుని సంహరించి, లోకాలకు సంతోషాన్ని పంచిన నీ మనోహరుడు, రాక్షసుల నిత్య శతృవు అయిన శ్రీహరి కి అపరిమితమైన ఆనందాన్ని కలిగించే దానవు. నీ తోడపుట్టిన చందృనికి ఇష్టమైన కలువ పూలను నీ ఆసనంగా చేసుకుని, ఈ జగత్తు కు ఆనందాన్ని ఇస్తున్నదానవి. అమ్మా, అష్టైశ్వర్యాలను ఇవ్వగల తల్లీ ! నిన్నే నమ్ముకున్న నాపైన నీ చల్లని చూపులను ఎప్పుడూ నిలిపి వుంచు, సత్యలక్ష్మీ!!
....... ఓం నమో వేజ్ఞ్కటేశాయ


కామెంట్‌లు