విద్యాలయం అనేది కేవలం పాఠ్యపుస్తకాల జ్ఞానాన్ని అందించే స్థలం మాత్రమే కాదు, జీవితాన్ని చదివించే, కలల్ని మేల్కొలిపే, సృజనాత్మకతను వెలికి తీయించే పవిత్రమైన వేదిక కూడా. ఈ భావనను సాక్షాత్కారమయ్యేలా చేసే సందర్భమే ఈ పుస్తక రూపంలో మీ ముందున్న ఇంటర్వ్యూ.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి, రచయిత, సినీ విమర్శకుడు శ్రీ వారాల ఆనంద్ గారు, తన విద్యార్థి దశలో చదివిన కార్ఖానగడ్డ ప్రభుత్వ పాఠశాలలో తన గురువుగారి చేత “త్రివేణి” కవితా సంకలనం ఆవిష్కరణ జరుపుకోవడం ఒక చారిత్రాత్మక ఘట్టం. ఆ సందర్భంలో మా విద్యార్థులు ఆయనతో జరిపిన ముఖాముఖి, వారి అమాయకమైన కానీ ఆత్మీయమైన ప్రశ్నలు, ఆయన ఇచ్చిన హృద్యమైన సమాధానాలు ఈ గ్రంథరూపంలో నిలిచాయి.
ఈ ఇంటర్వ్యూ కేవలం ప్రశ్నలు-జవాబుల సమాహారం మాత్రమే కాదు; ఇది ఒక తరం నుంచి మరొక తరానికి సాహిత్య స్ఫూర్తి పంచే ప్రక్రియ. విద్యార్థులు వేసిన ప్రశ్నలలో జిజ్ఞాస, ఆశ, స్వప్నాల విత్తనాలు దాగి ఉన్నాయి.
వారాల ఆనంద్ గారి సమాధానాల్లో అనుభవం, విజ్ఞానం, వినయం, సృజనాత్మక దృష్టి ప్రతిఫలించాయి. ఒక సాధారణ వ్యాపార కుటుంబంలో పుట్టి, సాహిత్య సౌధాల వరకు ఎదిగిన ఆయన ప్రయాణం, విద్యార్థుల కలలకూ రెక్కలు ఇస్తుంది.
ఈ పుస్తకాన్ని చదివే ప్రతి విద్యార్థి “చదువును కేవలం మార్కుల కోసం కాక, జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి నేర్చుకోవాలి” అన్న పాఠం నేర్చుకుంటాడు.
ఇక సాహిత్యం సమాజానికి దిశానిర్దేశం చేసే శక్తి అని ఈ పుటలు మళ్ళీ మళ్ళీ మనకు గుర్తు చేస్తాయి.
కోరగానే మా పాఠశాలకు వచ్చి మా పిల్లలతో ముచ్చటించి, ఒక గొప్ప అనుభూతిని ఇచ్చిన వారాల ఆనంద్ గారికి కృతజ్ఞతలు.
కార్యక్రమంలో ఆనంద్ గారితో పాటు కరీంనగర్ సాహితీవేత్తలు డా. నలిమెల భాస్కర్, డా. గండ్ర లక్ష్మణ రావు, గంప ఉమాపతి, నడిమెట్ల రామయ్య, పుల్లూరి జగదీశ్వర్ రావి, శ్రీలతారావు, పి.ఎస్. రవీంద్ర, సుదర్శనం వేణుశ్రీ, కె. ఎస్. అనంతాచార్య మొదలైన వారు పాల్గొనడం చాలా సంతోషాన్ని కలిగించింది.
ఇంత చక్కగా ముఖాముఖి జరిపిన మా చిన్నారులకు శుభాశీస్సులు. మా తెలుగు ఉపాధ్యాయులు మోతె చంద్రశేఖర్ రెడ్డి, గరిగె కన్నయ్యలకు ధన్యవాదాలు.
అలాగే, ఈ పుస్తకానికి ముందుమాట అందించి ఆశీర్వదించి, ప్రోత్సహించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి IAS గారికి కృతజ్ఞతలు.
మంచిని ప్రోత్సహించె మా కరీంనగర్ జిల్లా విద్యాధికారి శ్రీ శ్రీరామ్ మొండయ్య గారికి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ సిద్దిఖ్ అహ్మద్ద్ గారికి మరియు సహకరించిన ఉపాధ్యాయులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
పాఠశాల నిర్వహణలో ఎప్పుడూ చైతన్యవంతంగా ఉండే సీనియర్ ఉపాధ్యాయులు సర్వశ్రీ సంగోజు సత్యనారాయణ చారి, కూర రమేశ్ గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు.
అలాగే హిందీ ఉపాధ్యాయులు ఫరీదా ఖాతూన్, ఇఫ్తెకార్ అహ్మద్, మాధవి గార్లకు, ఇంగ్లీష్ ఉపాధ్యాయులు మంగ స్వాతి, నిఖత్ ఫాతిమా, ఏడుళ్ల లత గార్లకు, గణిత ఉపాధ్యాయులు చికినం స్వామీ, బలరాం నాయక్, బాలసంకుల శిల్పారాణి గార్లకు, ఫిజిక్స్ టీచర్స్ గోపు త్రివేణి, ధరణికోట ప్రభాకర్, మోహన్ నాయక్, శంకర్ నాయక్ గార్లకు, జీవశాస్త్ర ఉపాధ్యాయులు కొమురం సుజాత, రూపలత గార్లకు, సోషల్ టీచర్స్ అంజలి, ఉదయశ్రీ, శైలజ గార్లకు, వ్యాయామ ఉపాధ్యాయురాలు స్వప్న గారికి, క్రాఫ్ట్ టీచర్ గీతారాణి గారికి, కార్యాలయ సిబ్బంది రవీందర్ గారికి పేరుపేరునా ధన్యవాదాలు.
పాఠశాల నుండి ప్రారంభమై, జీవితాన్ని సృజనాత్మకత వైపు మళ్లించే ఈ ప్రయాణం ప్రతి విద్యార్థి హృదయంలో శాశ్వత ప్రేరణగా నిలిచిపోవాలని ఆకాంక్షిస్తున్నాను.
నంది శ్రీనివాస్ S.A. తెలుగు,
ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కార్ఖానాగడ్డ, కరీంనగర్


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి