శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - వ్యాఖ్యానము ;- భాగం - 11
 "సౌభాగ్యభాస్కరం" - శ్రీ భాస్కరరాయలు గారు.
శ్రీలలితా సహస్రనామములు - అక్షరక్రమ నామ సంఖ్య 
సంస్కృత వర్ణమాల - 16 అచ్చులు - 35 హల్లులు - మొత్తం 51 అక్షరాలతో ఉంటుంది.
ప్రతీ నామంలో వుండే మొదటి అక్షరం తో చూస్తే - మొత్తం 35 అక్షరాలతో అమ్మ నామాలు వున్నాయి.
వశిన్యాది దేవతల ద్వారా రచింపబడిన శ్రీలలితా సహస్రనామములలో ఏ అక్షరము తో ఎన్ని నామాలు వున్నాయి అనే విషయాన్ని భాస్కరరాయలు గారు తమ సౌభాగ్యభాస్కరం లో చక్కగా వివరించారు. మచ్చుకు కొన్ని..... 'అ' అక్షరంతో 40; 'ఆ' అక్షరంతో 10; 'ఛ' అక్షరంతో 01; 'క్ష' అక్షరంతో 09....ఇలా....
శ్రీలలితా సహస్రనామములకు "ఓం"; "ఓం ఐం హ్రీం శ్రీం";  "ఓం ఐం హ్రీం శ్రీం క్లీం" ఈ బిజాక్షరాలను ముందు వుంచి, నామం తరువాత "నమః" కలిపి పలికితే, తిరుగులేని 'రామబాణం' లాంటి అద్భుతమైన "మంత్రం" అవుతాయి. ఉదా: "ఓం శ్రీ మాత్రే నమః"
శ్రీలలితా సహస్రనామములను పైవిధంగా, మంత్రాలుగా మార్చుకుని, తమ కోరికలు సాధించుకోవడానికి, ఆయా నామాలయోక్క జపతపములు చేసి, శ్రీమహాలక్ష్మి, శ్రీమహాసరస్వతి, శ్రీ మహాకాళీ త్రిమూర్తి స్వరూపమైన "శ్రీలలితా మహాత్రిపురసుందరి" అమ్మలగన్నయమ్మ యొక్క మహదాశీర్వాదం పొందాలి అని ఆశిస్తూ.... అలా అనుగ్రహించమని అమ్మను ప్రార్థిస్తూ.....
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ


కామెంట్‌లు