"సౌభాగ్యభాస్కరం" - శ్రీ భాస్కరరాయలు గారు.
హయగ్రీవ - అగస్త్య సంవాదం - అగస్త్య మహర్షి ఆవేదన - అభ్యర్ధన
శ్రీవిద్యోపాసకులలో అత్యంత గొప్ప వాడైన అగస్త్యుడు, హయగ్రీవ రూపంలో వున్న శ్రీమహావిష్ణువు తో....తన సందేహాన్ని ఇలా అడుగుతున్నాడు.
"అన్ని శాస్త్రాలు అవపోసన పట్టిన ఓ హయగ్రీవస్వామీ! ఎంతో దయతో నాకు, శ్రీలలితా పరాశక్తి మన్త్రములు, న్యాసములు, పూజావిధానం, పురశ్చరణ విధానము, హోమములు, రహస్యములు, స్తోత్రములు అన్నీ నేర్పించావు. త్రిపుర సుందరీ దేవి ఆవిర్భావం, పట్టాభిషేకము, భండాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరి చేతిలో సంహరింపబడటం.... ఇలా అన్ని విషయాలనూ చెప్పావు."
"హయగ్రీవ స్వామి! న్యాసఖండములో చెప్పబడిన దేవి యొక్క ఆరు విధములైన న్యాసాలను ఎంతో చక్కగా వివరించి చెప్పావు. పన్చదశాక్షరీ మంత్రము యొక్క ప్రభావమూ వివరించావు. అంతర్యాగము, బహిర్యాగము, మహా యాగములు ఎలా చెయ్యాలో కూడా అర్ధం అయ్యేలా చెప్పావు."
"విరాట్స్వరూపుడవు అయిన హయగ్రీవ స్వామి! అమ్మ యొక్క*జపస్వరూపాన్ని* కూడా నీవు వివరించి చెప్పావు. శ్రీచక్రమునకు సంబంధించిన బిందువు మొదలు తొమ్మిది ఆవరణలనూ, వాటి ప్రశస్తినీ వివరించావు. శ్యామలాంబ, దండినీ దేవి అయిన వారాహీ దేవి ల సహస్రనామాలు చెప్పావు."
"సర్వమూర్తి స్వరూపమై, దయా హృదయము కలిగిన ఓ హయగ్రీవస్వామీ! లలితా పరమేశ్వరి గురించి ఇన్ని విషయాలను చెప్పిన నీవు, నాకు శ్రీలలితా సహస్ర నామమములు చెప్పడం మరిచిపోయారా, పరమేశ్వర! లేకపోతే, "రహస్యాతి రహస్యములు అయిన శ్రీలలితా సహస్రనామములు" వినడానికి నాకు యోగ్యత లేదని నిశ్చయించుకుని చెప్పలేదా, స్వామి!. కారణం తెలియజేసి, నాలో కలుగుతున్న అలజడిని తగ్గించి, నాయందు దయతో "రహస్యాతి రహస్యములు అయిన శ్రీలలితా సహస్రనామములు" తెలియజేయండి, స్వామి!"
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి