ఓ మాయమ్మ -2. -గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-సెల్.9491387977 కల్వకుర్తి
అమ్మ అమ్మ మాయమ్మ
నీ గర్భంలోన ఉన్నానమ్మ
నే వెంటనే బయటకు వచ్చి
నిన్ను చూడాలని ఉందమ్మ !

నీ వెంటనే బయటకు వస్తే
ఈ మగాడు నన్నే ఇక చూస్తే
కామం కళ్ళతో కాటేస్తాడన్న
భయం ఉంది నాకు ఇక మస్తే !

అందుకే ఆలోచిస్తున్నానే ఉన్న
బయటకు రాలేక నే చింతిస్తున్న
నాన్న కూడా ఒక మగాడే కదమ్మ
అన్న మీమాంసంలో పడిపోతున్న!

అమ్మా అమ్మా ఓ మాయమ్మా
నీవు కూడా కాస్త ఆలోచించమ్మా
నాన్న అనుమతి ఇక ఇస్తాడో లేదో
నీవే అడిగి వెంటనే ఇక చెప్పమ్మా !

వెంటనే నీవు నాకు జవాబు చెప్పు
అప్పుడు నాకుండదులే ఏ ముప్పు
మగాళ్ళంతా ఒకటే అనడం తప్పు
అవునోకాదో ఆనిజాన్ని నీవే చెప్పు

మగాళ్ళలోనూ మంచివారున్నారు
వారు మనకు.చేయుతనిస్తున్నారు
అందుకే ఆడపిల్లలు జన్మిస్తున్నారు
ప్రాణం పోసుకొని పయనిస్తున్నారు

పుట్టుకకు స్త్రిపురుషులు అవసరం
ఒకరికొకరు చేసుకోవాలి సహకారం
అప్పుడౌతుంది మన జన్మకు శ్రీకారం
తప్పక పడుతుందప్పుడు మమకారం !

కామెంట్‌లు