దాశరధి కృష్ణమాచార్య.(నేడు దాశరధి కృష్ణమాచార్య వర్ధంతి సందర్భంగా)========================================నా పంచపదుల సంఖ్య--- 2074-2078.--------------------------------------------2074.ఆయన సరి,కదిలే కవితల శరధి!తెలుగు సాహిత్య,మధుర అక్షర జలధి!తెలంగాణ విముక్తి,ఉద్యమ భాషా సారథి!తెలుగు సినిమా,అభినవగేయాల రథి!నా తెలంగాణ,కోటి రత్నాల వీణ,పోరాటాల శుద్ధి,పివిఎల్!2075.జననం వరంగల్ జిల్లా, గూడూరు గ్రామము!మెట్రిక్ ఉర్దూ, ఇంటర్,భోపాల్ విశ్వవిద్యాలయము!ఉస్మానియావిశ్వవిద్యాలయం,బి.ఏ.ఆంగ్ల సాహిత్యము!సంస్కృతం, ఇంగ్లీష్, ఉర్దూ, భాషలలోమంచిపాండిత్యము!చిన్నతనంలోనే పద్యం, అల్లడం అద్భుతప్రావీణ్యము,పివిఎల్!2076.ప్రయోక్త ,ఉపాధ్యాయుడు, ఇన్స్పెక్టర్ వారి ఉద్యోగము!సాహిత్యాన కథ, నాటిక ,పాట, కవిత, సృజనము!పీడిత ప్రజల గొంతుగా ,మారిన చైతన్య రూపము!నిజాం! గద్దె దిగాలంటూ, గర్జిస్తూ రచన వ్యాసంగము!జైలుశిక్ష, జైలుగోడలపై,బొగ్గుతో పద్యలేఖనము,పివిఎల్!2077భావ ప్రేరిత ప్రసంగాల, అద్భుత ఉపన్యాసకుడు!ఆంధ్రసారస్వత పరిషత్, స్థాపకుల్లో ప్రముఖుడు!తెలంగాణ రచయితల సంఘానికి అధ్యక్షుడు!ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా, విరాజిల్లినవాడు!గాలిబ్ గజళ్ళ ,గీతాలుగా,సరి అనువాదకుడు,పివిఎల్!2078.అగ్నిధార, రుద్రవీణ, నవమి, కవితా సంపుటాలు!కేంద్ర రాష్ట్ర సాహిత్య,అకాడమీ వారిబహుమతులు!ఆం.వి.వి, కళాప్రపూర్ణ, వేం.వి.వి డి.లిట్ స్వీకారాలు!కవిసింహం, యువకవిచక్రవర్తి,మెచ్చు బిరుదులు!ఖుషి ఖుషీగా నవ్వుతూ, వంటి బహు చిత్రాల పాటలు,పివిఎల్!_________
కలం రుద్రవీణ! కవిత అగ్నిధార!:- డా పివిఎల్ సుబ్బారావు విజయనగరం,- 9441058797.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి