నువ్వే నువ్వే నువ్వే
నన్ను ప్రేమించింది నువ్వే
నీపై ఉన్నది నాకు లవ్వే
నీ శిఖర్లో పెడతా ఇక పువ్వే !
నువ్వే నువ్వే నువ్వే
నా వెనక ముందు నువ్వే
నా వెంటే నీవికవుంటే
మనసంతా సుఖాలపంటే !
నువ్వే నువ్వే నువ్వే
ఏదే ఇక నీ చిరునవ్వే
సంతోషంతో నీవుంటే
నేనుంటా ఇక నీ వెంటే !
నువ్వే నువ్వే నువ్వే
నీ వెలిగిస్తా నీకై దివ్వే
వెలిగే చమురు పోస్తాష
కలిగే సుఖమును ఇస్తా !
నువ్వే నువ్వే నువ్వే
నీపెదాలు నవ్వే రువ్వే
పెడతా నీకిక ఓ ముద్దు
అడ్డే నీవు ఇక చెప్పొద్దు !
నువ్వే నువ్వే నువ్వే
నీ ప్రేమే మనలను దువ్వే
కావున ఉందాం కలసి మెలసి
ఏమంటావే నా ప్రియ తులసి !

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి