నారాయణ నారాయణ
ఓ మా శ్రీమన్నారాయణ
నీ చిత్రాన్ని నే చిత్రించన
నాగాత్రంతో నే కీర్తించన !
నారాయణ నారాయణ
మా శ్రీ లక్ష్మీ నారాయణ
నే గీసిన నీ చిత్రం చూడు
నిర్మిస్తా దానికై ఓ గూడు !
నారాయణ నారాయణ
మా నారద పారాయణ
మేము పట్టాము నీ దీక్ష
మాకు పెట్టు నీ దయ బిక్ష !
నారాయణ నారాయణ
మా సత్యనారాయణష
మేం చేస్తున్నాం నీ వ్రతం
అదేలే మాకు సమ్మతం !
నారాయణ ఓ నారాయణ
మా హరి హర నారాయణ
ఇల నీవేగా మా కుల దైవం
తీరేనుగా ఇక మాకల వైనం
నారాయణ ఓ నారాయణ
నిత్య ధూప మా నారాయణ
సత్య రూప నర నారాయణ
మత్స్య రూప ఓ నారాయణ !
నారాయణ మా నారాయణ
మా నిత్య సత్య పారాయణ
నీ వ్రతమును మేం చేస్తున్నం
నీ క్రతువును ఇక చూస్తున్నం !
నారాయణ నారాయణ
ఆది అనాది నారాయణ
నీవేగా మాకు ఇక దిక్కు
మాకు ఉండదు ఏ చిక్కు !
నారాయణ ఓ నారాయణ
మా పుర హర నారాయణ
మాకు మోక్షాన్ని అందివ్వు
నీవు దివికి కాస్త సందివ్వు !
నారాయణ ఓ మా నారాయ
కలియుగ కల్కి నారాయణ
నీవేలే ఇక.మాకు పదివేలు
నీవేగా చూసేదిక మా మేలు !
నారాయణ ఓ మా నారాయణ
మాశేషతల్ప హరి నారాయణ
మాకు మోక్షమును అందించు
మా రక్షణకు నీవు స్పందించు !

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి