కార్తీక మాసం ఈ కార్తీకమాసం
తొలగించును ఇక మన దోషం
ఈ మాసంలోన నదిలో స్నానం
తొలగించునులే మన నిస్త్రాణం !
కార్తీక మాసం మన ఈ
కార్తీక మాసం
శివ కేశవులను పూజిస్తే తొలగు మన దోషం
దానం ధర్మం తప్పక మీరు చేయండి
ధర్మదాతలై తప్పక మీరు ఇల పై నిలవండి
పూజలు చేస్తూ గుడిలో భక్తుల కలవండి !
మాసం మాసం ఈ కార్తీక మాసం
దోషం దోషం పోయి కలుగు గాసం
ఇక భక్తుల అందరికీ గుడి నివాసం
ఆ దైవంతో ఇక వారికి సహవాసం
మనమంతా కార్తీక మాసం యందు
మన వారితోకూడి చేయాలి విందు
చూసేవారికి ఔతుంది ఇది పసందు
భగిని భోజనం చేస్తే మంచిదందు !
మన ఈ కార్తీక మాసమేను
కోటి కాంతుల వెలుగులీను
అందు విందును చేయరా
అడుగు ముందుకు వేయరా !
ఈ మన కార్తిక మాస విశేషము
జీవితాన మిగిల్చదు ఏ శేషము
గమనించి చేయవోయి పండుగ
గతి తప్పకుండా నీవు నిండుగ !
మన కమనీయ కార్తీక మాసం
కామితముల నెరవేర్చే మాసం
ఏ దోషమైన తొలగుట విశేషం
అదేగా ఈ మాసం సన్.సేషన్ !
ఈ మాస మందు భగిని భోజనం
చేయాలిరా మనసారా మన జనం
మన ఇంట్లోకి వచ్చి చేరు ధనలక్ష్మి
అదే జీవితానికి దీవెనఇంధన లక్ష్మి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి