కంది మండలంలోని ఆయుధ కర్మాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కంపెనీ చీఫ్ జనరల్ మేనేజర్ ప్రసాద్ గారి చేతుల మీదుగా నగదు బహుమతులు మరియు ప్రశంసా పత్రాలు పొందారు. అక్టోబర్ 27 నుంచి నవంబర్ రెండవ తేదీ వరకు జరిగిన నిఘా వారోత్సవాలకు సంబంధించి"నిఘా-మన ఉమ్మడి బాధ్యత" అనే అంశంపై పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన మరియు నినాదాల పోటీ నిర్వహించారు. విజేతలకు బహుమతి ప్రదానం జరిగింది. వ్యాసరచనలో మొదటి బహుమతి రాహుల్, ద్వితీయ బహుమతి మనోహర్, తృతీయ బహుమతి హయతి, నినాదాల పోటీలో మొదటి బహుమతి మహన్య, ద్వితీయ బహుమతి సృష్టి, తృతీయ బహుమతి పూజ పొందారు. కార్యక్రమంలో గైడు ఉపాధ్యాయులు అడ్డాడ శ్రీనివాసరావు, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆయుధ కర్మాగారం విద్యార్థులకు బహుమతులు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి