ఒక మాట......
దూరాన్ని తొలగిస్తుంది
దుఃఖాన్ని తగ్గిస్తుంది
బాధను విముక్తి చేస్తుంది
బంధాన్ని నిలుపుతుంది
స్నేహాన్ని బలపరుస్తుంది
ప్రాణాన్ని ఇస్తుంది
రేపటిని ప్రసాదిస్తుంది
నేటిని నిర్వచిస్తుంది
గతాన్ని నిదురలేపుతుంది
సాన్నిహిత్యాన్ని సాక్షాత్కరింపజేస్తుంది.
సాంత్వన కలిగిస్తుంది
మంత్రమై పనిజేస్తుంది
బాణమై లక్ష్యాన్ని ఛేదిస్తుంది
సంతోషమై తాండవిస్తుంది
లాలనై ఓదారుస్తుంది
దీవనై ఫలిస్తుంది
దీపమై దారి చూపుతుంది
కర్తవ్యమై కనబడుతుంది
జ్ఞానమై బోధిస్తుంది
గానమై మైమరిపిస్తుంది
ధ్యానమై మిగులుతుంది
అందుకే......
అన్నీ మరిచిపోయి...
ఒకమాట తప్పక మాట్లాడండి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి