సామెత -37; అందని గోచికి-(చీకిన) చీకటం పట్టిన మొలతాడు
*****
"ఏందిరా అయ్యా! వచ్చినకాన్నుంచి పడీ పడీ నవ్వుతున్నవ్! ఏం యాది కొచ్చింది? గదేందో జెప్పరాదు? మేం సుత ఆయిగ నవుకుంటం. "
"అవ్వా! పీరయ్య మావ కొడ్కు తెల్సుగా గాడు,నేను ఇంకొందరం గల్సి పొద్దుగాల మన పెద్ద చెర్లకి ఈతకి బొయినం.గక్కడ...గక్కడ .. అన్కుంట మల్ల ఆగకుండ నవ్వుతున్న కొడ్కును జూస్కుంట గంతగనం నవ్వబడ్తివేందిరా..సెప్పరా అయ్యా!"
అవ్వా! గాడు గాడు పీరయ్య మావ కన్న పీనాసోడు. గాడి చెడ్డి తోడ్కలు తోడ్కల్గ చినిగి బుడ్డ గోచి పెట్నట్టుంది. పైన లబ్బరు పంజేయట్లేదేమో మొల్తాడుకు సుట్టుకుందమనుకుండు.అదేమో అందట్లె.గట్టిగ గుంజిండు. గది సుత చీకటం బట్టిందట్టుంది.పుటుక్కున తెగింది.ఇంగ గాని అవత్త జూడాలి...సటుక్కున నీళ్ళల్ల దూకిండు...
"గదినేతల్కి అవ్వకి సుత నవ్వాగలె.పొట్టసెక్కలయ్యేట్టు నవ్కుంట.. "మరా గోచి నీళ్లల్ల కొట్కబోయిందా? కొట్కపోకుండ ఎట్లుంటది"." అందని గోచికి-చీకటం పట్టిన మొలతాడు "అన్కుంట గిస్మంటోళ్ళను జూసే గస్మంటి సామెతలు బుట్టినయ్."
భుజాన సంచులేస్కుని బడికి తయారైన బుడ్డోడు భూలచ్మి గదంతిని పక్కడ పక్కడ నవ్కుంట ఎగుర్తూ "మామ షేమ్ షేమ్ పప్పీ షేమ్" అంటుంటె..."
ఒరేయ్!అయ్యా! ఎవ్వలికైన చెప్పేవ్! ఇప్పటికే గాడు ఇజ్జత్ పోయిందని సిగ్గుపడ్తుండు. ఇంగ ఆడి పిశినాశితనాన్కి పరువు సుత బోద్ది."
"ఎవ్వలికి జెప్పనే! నా దోత్తుకు ఒక్కన్కె జెప్త"... "వామ్మో! గీడు పరువు దీశేట్టె వుండు."గందుకె పొల్లగాండ్ల ముందు ఏ ముచ్చట్లు సెప్పొద్దు అన్కుంట... "అవ్వా గాళ్ళు ఇయ్యాల నోరు దెర్వకుండ సూడే "బతిలాడుతుంటే.... పిల్లలిద్దర్కీ 'బెల్లప్పాకపు గడియారాలు' జేసి చేతుల్కి అతికిచ్చి పంపింది.
"ఇంగ నోరు తెరిస్తే అంతొట్టు. ఎవ్వలు సూడకుండ వయ్యినో,పల్కనో అడ్డం పెట్కొని నాకి అంగితోటి బుడ్డోడు,పరికిణా తోటి భూలచ్మి మూతి దుడుసుకోవడంతోనే దినమంత గడిసింది.
పొద్దుగూకినంక గిదంత తెల్సి అవ్వా! నువ్వు సామాన్నురాల్వి గాదే!నిన్నే గన్క మా తాతయ్య పెద్ద సదువులు సదివిత్తెనా... అంటుంటే..."ఇంగ జాల్ పో రా ! ముల్గ సెట్టు ఎక్కిపియ్యకు..నవ్కుంట లోపలికి వెళ్ళింది అవ్వ.
గదండీ సంగతి! "అందని గోచికి- (చీకిన)చీకటం బట్టిన మొలతాడు" అంటే... గదంత పిసినార్ల విషయమైనా గావచ్చు.లేదంటే మరీ దరిద్రం అనుభవిస్తున్న వ్యక్తి పరిస్థితి కావచ్చు. ఏది ఏమైనా అక్కడిదాకా తెచ్చుకోకూడదు కదా!'

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి