మబ్బుతెరల మాటున
ముత్యంలా వెలిగే రవి
మంచు దుప్పటి తోసి
మేలుకున్న భువి!
కాంచన కాంతులు సోకగనే
పరిసరాలు పరికించి
ఏకాంతం వదిలేసి
వెలుతురుతో మమేకమై పోయె!
ప్రభవించి వెలుగు ప్రసరించి
ప్రతి అణువునూ చైతన్య పరచు
ప్రభాకరుని దర్శనం కోసం
పరితపించు పృథ్వి!
కదలక నిలుచున్న కాసారమందు
కనిపించేనదుగో కనకకుంభము
ఎదుట నిలిచె చూడు సత్యమై
ఎదలో కొలువున్న దైవము!
ఆటంకములొచ్చాయని
అరుణోదయం ఆగునా
అందాల్సిన అనుగ్రహం
ఆలస్యమైనా వచ్చి చేరుగా!
ముళ్లదారుల చివర
మురిపించె గమ్యం లా
బాటలోనే బ్రతుకంతా
తేట తెల్లమవుతుంది!
🌸🌸సుప్రభాతం 🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి