అంశము
ఆస్తికుని ఆస్తి- భగవంతుని ప్రాప్తి
అథ చిత్తం సమాధాతుంన శక్నోషి మయి స్థిరమ్!
అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ !
ఆస్తికుడు (భగవంతుని అస్తిత్వాన్ని నమ్మినవాడు) జీవిత ధ్యేయం భగవంతుని ప్రాప్తి .భగవత్ ప్రాప్తికి ఉపాయములు తెలిసి కొనగోరు వారికి అర్జునుని ప్రశ్న ,దానికి భగవానుడి చ్చిన జవాబులతో కూడిన భగవద్గీత--12వ అధ్యాయం భక్తి యోగము*సరి అయిన దారి ఆస్తి కులకు చూపిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
సగుణ ,నిర్గుణాలలో ఉత్తమం ఏది? అనే అర్జునుని ప్రశ్నకు భగవానుని జవాబు---::
పరమేశ్వరుడనైన నా యందే ఏకాగ్రచిత్తులై నిరంతరం నా భజన ధ్యానాదులయందే నిమగ్నులై అత్యంత శ్రద్ధా భక్తుల తో సగుణ రూపమున నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్టులని నా అభిప్రాయం.
కాబట్టి భగవంతుని సగుణారాధన భగవత్ ప్రాప్తికి ఉత్తమ సాధనం. సగుణానికి, నిర్గుణానికి ఉండే భేదాన్ని వివరిస్తూ పరమాత్ముడే అన్నాడు.
నిర్గుణ బ్రహ్మ ప్రాప్తికై చేయు సాధన మిక్కిలి శ్రమతో కూడినది. కాని నా సగుణపరమేశ్వర రూపమునే అనన్య భక్తి యోగముతో సతతము చింతన చేయుచూ, భజించు పరమ భక్తులను నేను శీఘ్రముగా మృత్యు రూప సంసార సాగరం నుండి ఉద్ధరించెదను.భగవానుడు ఇంకా ఇలా అంటున్నాడు
నాయందే మనస్సు నిలుపుము. నాయందే బుద్ధిని లగ్నముచేయుము. పిమ్మట నా యందే స్థిరంగా నుందువు. ఇంక ఏమాత్రముసంశయం లేదు. మనస్సు స్థిరముగా నిలప లేకపోతే అభ్యాసము ద్వారా నన్ను పొందుటకు ప్రయత్నింపుము. అభ్యాసమున అసక్తుడవైతే మత్పరాయణుడవై కర్మలను ఆచరింపుము. *సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు*అని పెద్దల మాట. అట్లయినా కూడా నన్నే పొందెదవు.
అభ్యాసము,---:: భగవంతుని నామగుణముల శ్రవణ, కీర్తన, మననములు, అట్లే శ్వాస ద్వారా జపము, భగవంతుని ప్రాప్తికి సంబంధించిన శాస్త్రముల పఠన, పాఠములు వీటిని మాటిమాటికి చేయుట నే అభ్యాసము అందురు.
భగవత్పరాయణుడు
స్వార్థమును త్యజించి పరమేశ్వరుడే పరమాశ్రయుడు, పరమ గతి అని భావించి సంపూర్ణ శరణాగతి అని తెలిసికొని నిష్కామ భక్తి భావముతో, పతివ్రతా శిరోమణి వలె మనోవాక్కాయముల ద్వారా, యజ్ఞ ,దాన తపశ్చర్యా క ర్తృత్వ కర్మలన్నింటిని చేయువానిని భగవత్పరాయణుడు అంటారు.
పై రెండింటికి అశక్తుడవైన సకల కర్మ ఫలములను త్యజించుము.సకల కర్మ ఫల త్యాగం
చేయుము. దీనికి పుష్టిగా తొమ్మిదవ అధ్యాయములో చెప్పిన మాట తలుచుకుందాం.
ఓ కౌంతేయా! నీవు ఆచరించు కర్మలను, భుజించెడి ఆహారమును, హోమం చేయు హవ్యమును, అర్పించు దానమును, ఆచరించు తపస్సును, నాకు సమర్పింపు ము.
"తత్త్వం ", ఎరుగక చేసే అభ్యాసము కన్న "జ్ఞానము," అనుభవ రహిత జ్ఞానముకన్న ,"ధ్యానం" పరమేశ్వర స్వరూప ధ్యానం కన్న
కర్మ ఫల త్యాగం
క్రమంలో శ్రేష్టం కాబట్టి కర్మ ఫల త్యాగం మిక్కిలి శ్రేష్టం. దానివలన (శీఘ్రమే) వెంటనే "పరమ శాంతి" లభించును. ఆ పరమ శాంతి పొందిన వాడే భగవాత్ ప్రాప్తినొందిన వాడు.(లేదా) భగవంతునికి ప్రియమైన వాడు.
శ్రీమద్భగవద్గీత"
12వ అధ్యాయము భక్తి యోగము అన్ని శ్లోకముల భావము వ్రాయబడినది
_______
______

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి