ఓం పార్ధాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం
వ్యాసేన గ్రధితాం పురాణ మునినా మధ్యే మహాభారతం.
2*(విషాదము-వివేకం),
మనిషి జీవితం రోదనంతో ఆరంభం. రోదనం లేకపోతే జీవనం లేదు. మనిషి పుట్టిన వెంటనేకేర్,కేర్. మని ఏడుస్తాడు. అలా ఏడవకపోతే పుట్టినప్పుడు అక్కడున్న డాక్టర్ శిశువు తుంటి మీద ఓ చిన్న దెబ్బ వేసి ఏడిపిస్తాడు. అప్పుడు చుట్టూ ఉన్న వారంతా శిశు వు బతికి ఉన్నాడని నవ్వుతారు. శిశువు ఏడవకపోతే బ్రతికి లేడనిమిగిలిన వారందరూ ఏడుస్తారు..
యోధుడు యుద్ధం చేయలేనప్పుడు, విద్యార్థి పరీక్షలో తప్పినప్పుడు, యువకులు పోటీ పరీక్షలోనైనా, ప్రేమలోనైనా విఫలమైనప్పుడు, వ్యాపారి వ్యాపారంలో కుదేలయినప్పుడు, నాయకుడు పదవి కోల్పోయినప్పుడు, ఆటగాడు ఆటలో ఓడినప్పుడు, రైతు పంట వరదల పాలైనప్పుడు, ధనవంతుడు బికారి అయినప్పుడు, వృద్ధుడు వృద్ధాప్యం భరించలేనప్పుడు, మనిషి తన వారు అనారోగ్యానికి గురి అయినా, కాలం చేసినా విషాదం. ఇలా లోకం శోక హస్తగతం.
విషాదం లేని మనిషి విశ్వంలో కానరాడు. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏ విధమైన విషాదం శాశ్వతం కాదని. విషాదం చుట్టి ముట్టినప్పుడు మనిషి ఆ విషాదంలో మునిగిపోకుండా దానిని అధిగమించడానికి కావలసిన వివేకం వికసింప చేసుకోవాలి. వివేకం తోనే విషాదం నిర్మూలనం. తద్వారా విజయం సాధ్యం.
ప్రపంచానికి ఆదర్శవంతమైన మానవజాతికి అనుసరణీయమైన ఆధ్యాత్మిక గ్రంథం*శ్రీమద్భ గవద్గీత*. అర్జున విషాద యోగంతో ప్రారంభమవుతుంది. విషాదం నుండి తీరుకుని పరమాత్మ బోధ వల్ల వివేకవంతుడై సార్ధక నామధేయుడై మానవజాతికి యుగయుగాలకు ఆదర్శంగా నిలచాడు అర్జునుడు.
ఆ విషయం తెలుసుకుందాం.
సమర భూమికి వచ్చి ఉన్న బంధువులను అందరినీ చూచి కుంతీపుత్రుడైన అర్జునుడు శోకసంతప్తుడై కరుణా హృదయుడై ఇట్లు పలికెను.
ఓ కృష్ణా! సమరోత్సాహముతో ఈ రణరంగమున నిలిచి ఉన్న స్వజన సమూహమును చూచి నా అవయవములు శిధిలమగుచున్నవి. నోరు ఎండిపోవుచున్నది. శరీరమునందువణుకు, గగుర్పాటు కలుగుచున్నవి. గాండీవము చేతి నుండి జారిపోవుచున్నది. చర్మం తపించిపోవుచున్నది. మనసు బ్రమకు గురి అయినట్లని పించుటవలన ఇక్కడ నిలబడలేకపోవుచున్నాను. విషాదం ఆవరిస్తే ఏ పార్థుడైన ఇంతే. ఇంకా ఏమంటున్నాడో చూడండి.
ఓ కేశవా! పెక్కు అపశకునములు కనబడుచున్నవి. యుద్ధమున స్వజన సమూహమును చంపుట చే శ్రేయస్సు కలుగునని అనిపించుటలేదు. నేను విజయమును గానీ, రాజ్యము గాని సుఖములు గాని కోరుకొనుటలేదు. ఈ రాజ్యము వలనగాని, ఈ భోగముల వలన గాని, ఈ జీవితం వలన గాని ప్రయోజనమేమి? మనము ఎవరికైనా ఈ రాజ్యమును భోగమును కోరుకొను చున్నామో వారే ప్రాణముల మీద ఆశ వదులుకొని యుద్ధమునకు వచ్చియున్నారు. ఇక్కడ ఉన్న గురువులు, తండ్రులు, తాతలు, మేనమామలు, సోదరులు, కొడుకులు, మనుమలు, మామలు, బావమరుదులు, ఇంకా ఇతర బంధువులు ఇలా ఎందరో నా వారే.
మనసు పరిపరి విధాల పోవడం అంటే ఇదే కదా.
*ఓ నారాయణా!
ముల్లోకాదిపత్యముకైనా, నేను ఎవరిని చంపను. ఇక ఈ ధరామండల విషయమై చెప్పనేలా.? అటులనే వీరిలో ఎవరైనా చంప బూనినను నేను మాత్రం వారిని చంపనే చంపను. ధార్తరాష్ట్రులను చంపి మనము బాపు కొనునది ఏమి? ఈ ఆతతాయలను చంపుట వలన మనకు పాపమే కలుగును.. స్వజనులను చంపిన మనకు సుఖం ఎట్లువచ్చును. లోభ కారణముగా బ్రష్ట చిత్తూలైన వీరు కులక్షయం వలన కలుగు దోషమును మిత్ర ద్రోహం వలన సంభవించు పాపములను చూడలేకున్నారు.
"ఓ జనార్ధనా!
కుల నాశనం వలన కలుగు నష్టములను ఎరిగి మనము ఈ పాపమునకు దూరముగా ఉండుటకు ఏల ఆలోచించరాదు? అని తార్కి కంగా వివరిస్తూ"కులక్షయం"ప్రభావం గూర్చి ఎంతో వివరముగా చెపుతున్నాడు..
*ఓ మాధ వా! కుల క్షయమువలన సనాతనములైన కులధర్మములన్నియు
నశించును. ధర్మములు అంతరించిపోయినప్పుడు కులమునందు అంతటను పాపమే వ్యాపించును. పాపము మితిమీరినప్పుడు కుల స్త్రీలు మిక్కిలి దూషితలు అయ్యెదరు. స్త్రీలు దూషితలైనచో వర్ణ సాంకర్యం ఏర్పడును.
వర్ణ సాంకర్యము కులమును నరకమునందు పడవేయను. పిండోద కాలు లోపించుటవలన వారి పితరులు అధోగతి పాలయ్యెదరు. ఈ దోషం వల్ల సనాతన ధర్మములు జాతి ధర్మాలు నష్టమగును. కుల ధర్మములు నశిస్తే నెరవేగముగా నరక ప్రాప్తి తప్పదని ప్రతీతి.
*ఓ విష్ణు వా!
శస్త్ర రహితుడునై ఎదిరించని నన్ను, శస్త్రము చేబూని ధార్తరాష్ట్రులు యుద్ధముల వధించిను అది నాకు మిక్కిలి క్షేమకరమే. అర్జునుడు ఈ విధముగా పలికి శోక మానసుడై యుద్దభూమి యందు ధనుర్భాణములు త్యజించి, రథమువెనుక భాగమున చతికిలబడెను. అతని కనులలో అశ్రవులు నిండి యుండెను.. అవి అతని వ్యాకులతను , శోకములేదా విషాదమును తెలుపుచుండెను.
అంత పరమాత్ముడు ఓ అర్జునా!
పిరికితనమునకు లోను కావద్దు. నీకు ఇది ఉచితము కాదు. ఓ పరం తపా.తుచ్ఛమైన ఈ హృదయ దౌర్భల్యమునువీడి యుద్ధమునకై నడుం బిగింపుము అని పలికెను.
దానికి ప్రతిగా అర్జునుడు*ఓ మధుసూదనా*
పూజ్యులైన భీష్మ పితామహుని, గురువైన ద్రోణాచార్యులను యుద్ధమునఎదిరించి బాణములతో ఎలా పోరాడగలను. ఆ ఇరువురును చంపకుండా ఈ లోకమున బిచ్చమెత్తుకొని జీవించినను శ్రేయస్కరం
. ఏలననినా వీరిని చంపిన తరువాత రక్తసిక్తము లైన రాజ్యసంపదలను, భోగములను నేను అనుభవించవలసి యుండును. ఇక్కడ అతనికి వారిరువురిపై గల గౌరవ ముకు నమ స్కరించాలి.
అర్జునుని ప్రశ్నలు చూడండి.
ఈ యుద్ధము చేయుట శ్రేష్టమా? చేయకుండుట శ్రేష్టమా అన్నది ఎరుగను. ఈ యుద్ధమునవారిని మనము జయింతు
మా.? లేక వారే మనలను జయింతురా?. అనే విషయము కూడా ఎరుగను. ఇటు లనే ఉంటుంది విషాదం ఆవరించిన యోథుని పరిస్థితి.
అర్జునుడు తన పరిస్థితిని భగవానునికి వివరిస్తు న్నాడు.
పిరికితనమునకు లోనై నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడు చున్నాను. ఈ శోకమున ఇంద్రియములను దహించి వేయుచున్నది. ధర్మాధర్మముల విచక్షణకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించు కొనలేకపోవుచున్నాను. నాకు శ్రేయస్కరమైన దానిని తెలుపుము. నేను నీకు శిష్యుడను. శరణాగతుడను. ఉపదేశింపుము అని ప్రార్థించెను..
మనము కూడా విషాదం ఆవరించినప్పుడు మనం మన హితం కోరే పెద్దల సలహా తీసుకొనవలెను. అంతేకానీ మనలో మనం కుమిలి పోయిన ప్రయోజనం లేదు.*
భగవానుడు శ్రీ కృష్ణ పరమాత్మ *అంటున్నాడు
ఓ అర్జునా!
రణరంగమున మరణించినచో నీకు వీర స్వర్గము ప్రాప్తించును. యుద్ధముల జయించినచో రాజ్య భోగములను అనుభవింప గలవు. కనుక కృత నిశ్చయుడివై యుద్ధమునకు లెమ్ము అనెను. ఎంత విషాదములోనైనా కర్తవ్యం మానకూడదని గ్రహించాలి. అయితే ఇది అంత తేలిక కాదు. సమయం పడుతుంది. అర్జునుడు వెంటనే యుద్ధమునకు
లేవలేదు.
పది అధ్యాయములు పూర్తయి 11వ అధ్యాయము ప్రారంభములో అర్జునుడు
ఓ కృష్ణా! నన్ను అనుగ్రహింపదలచి పరమ గోప్యమైన ఆధ్యాత్మిక విషయములను ఉద్దేశించి తివి. దానివల్ల నా అజ్ఞానము, మోహము తొలగిపోయినది. అని అనెను.
కానీ వెంటనే యుద్ధానికి సిద్ధపడలేదు.
18 అధ్యాయములో 73 వ శ్లోకము వచ్చినప్పుడు అన్నాడు
ఓ అచ్యుతా! నీ
కృప చే నాలో మోహము పూర్తిగా తొలగిపోయినది. స్మృతి నిపొంది తిని. ఇప్పుడు సంశయ రహితుడనైతిని. కనుక నీ ఆజ్ఞను తలదాల్చెదను.
18వ అధ్యాయము 78వ శ్లోకముతో గీత పూర్తి అవుతుంది. విషాదంతో ప్రారంభమైన స్థితి వివేకం రావడానికి 18 అధ్యాయముల బోధన సాగవలసి వచ్చినది. తెలుసుకోవలసిన విషయం ఇది.
వివేక భానుడు విస్తరిస్తున్న కొద్దీ, విషాదాంధకారం క్రమేపీ తొలగిపోతుంది. జీవితం వెలుగులతో నిండిపోతుంది.
ఆనాటి పార్ధుడే కాదు ప్రార్థన అయినా మనమంతా జీవితంలో విషాదం ఎదురైనప్పుడు కృంగిపోక స్థిమితంగా దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేసి తీ
రాలి వివేకంతో విషాదాన్ని ఎదిరించాలి.
ఈ క్రింది అధ్యాయములలో శ్లోకముల ఆధారం.
1-1,27నుండి47వరకు,2-4నుండి8వరకు, మరియు 57";;,11-1,18-73...

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి