ఓ పిల్లా!:- గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-సెల్.9491387977 కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ
నీవు తలుపు దగ్గరేసి
నీ దోర వలపు పగ్గమేసి
నా మనసు  కొల్లగొట్టకు
ఈ వయసునిక ముట్టకు  !

లేలేత వయసు నాది
భయమన్నది ఉన్నది
ఉండాలి మనం దూరం
వేయకు ఇక ఆ ద్వారం !

నువ్వేలేరా నా ప్రాణం
నా కుందిగా నిస్త్రాణం
కాదురా ఇది సమయం
పాటిద్దాం సంయమనం!

కాదు కూడదు అంటే
జరుగు మనకు తంటే
నా మాట నీవు వింటే
ఉంటా సదా నీ వెంటే !

ఏమంటావు ఓ బావా
నా మాట కాదంటావా
అవునంటావని తెలుసు
చెబుతుంది నా మనసు !

నా మదిలో నీకే చోటు
చేయనులే నేనిక లోటు
వెంటనే నీవద్దకు నేవస్తా
 నా ప్రేమను నీ కందిస్తా !

నీ చిరునామా తెలియక
నే పడుతున్నాలే తికమక
నీవు తలుపేసిన ఆ రోజు
నేతీర్చలేదు కదా నీ మోజు !

అందుకు ఎంతో చింతిస్తున్న
నీ క్షమాపణకై నేనిక వస్తున్న
క్షమిస్తావని నాకు ఇక తెలుసు
నాప్రేమను చేయకు నీవలుసు.!

కామెంట్‌లు