ఆకాశoలో చందమామల్లే పిల్లలు నవ్వితేనే
భావి జగతిలో పసిడి చిరునవ్వులు వెలిగేది
భావి జగతికి బంగారు లోగిలి పిల్లలు
కోటి వెలుగుల వసంతము భువిలో విరిస్తేనే
పుడమి లోగిలిలో నిత్యపండగై విరిసేది
కమ్మని కోకిలగొంతులు పసిడి నవ్వులు
విరబూసిన మమతల లోగిలి పిల్లలైతేనే
సమస్త ప్రపంచము ఆనందంలో మురిసేది
జగతి లోగిలిలో నిత్య సంతోషాల లోగిలి పిల్లలు
అటలనే కొలువులో పిల్లలు నాట్యమాడితేనే
మానసిక ఉల్లాసంలో ఊయలు ఊగేది
జగతిలో నిత్య వసంత పరిమళo పసిడి నవ్వులు
దేశమాత మెడలో ముగ్ద మణిదీపమైతేనే
అరవిచ్చిన నెమలి నాట్యమల్లే మురిపించేది
ప్రతిమదిలో మమతల పందిరి పసిడి పిల్లలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి