మంచి కవితలు సదా కుదురుతాయి:-విత్తనాల విజయకుమా కుమార్-హైదరాబాద్.
సాహితీ కవి కళాపీఠం 
సాహితీ కెరటాలు
================
=కళాపోషకులు కళలను ఆస్వాదిస్తూ ఉద్ధరించడం ఘనమే,
తెలియని వివేకంతో కళాకారులుగా మారాలనుకోవడమే ఘోరం.
భజనపరుల అండతో కావ్యాలను సృజించి, మెప్పులు ఆశిస్తే ...
బుద్ధిలేని ఆశ్రితులు చప్పట్లు కొడితే  కుదర లేని కావ్యాలుగా మిగులుతాయి.

అక్రమ పద్ధతిలో భాష్యాన్ని మార్చి అసంబద్ధమైన అంశాలను చేర్చి ...
తలా తోకా లేని రూపాన్ని కవిత్వమంటే అది కుదర లేని కావ్యమే.
గ్రాసంలేని కొలువూ, మీసంలేని బ్రతుకూ, రసం లేని కావ్యమూ కనబడతాయ్.
పాఠకులను మనోవేదనకు గురి చేసే విషగుళికలవుతాయ్.

ఒకప్పుడు ఆకాశమార్గంలో  సాగిన కవిత్వం భూమార్గం వచ్చాక కూడా,
సామాన్యప్రజలకి అర్థం కాకపోతే ...
సామాజికపరిస్థితులకి అద్దంపట్టకపోతే ...
అది నిస్సందేహంగా జనులకు పనికిరాక కనబడే కుదర లేని కావ్యమే.

ద్వందార్థాల పదాలను అనసందర్భంగా చొప్పించి,
శారీరాకారాలను రోత కలిగే పదాలతో వర్ణించి,
పాత్రల ఔచిత్యాన్ని కించపరిచే భాషను వాడితే ...
అవివేకి వర్గం ఆదరించే కుదరు లేని కావ్యాలవుతాయి.

అసందర్భ విరుపులూ చరుపులూ మెరుపులు కాదు. 
పనికిరాని అరుపులతో సాహిత్యానికి కురుపులు పట్టకూడదు. 
సాహితీ కెరటాల ఔనత్యం అంబరానికి చేరేలా,
పోటీపడి సృజించే మంచి కవితలు సదా అద్భుతంగా కుదిరే కావ్యాలే.

•••••••••••••~•

కామెంట్‌లు