భాగ్యనగరంలో కవి అయ్యలసోమయాజులకు ఆత్మీయ సత్కారం.
  భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్  ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత్రి డాక్టర్ యశోద గొట్టిపర్తి గారి యశోకాంక్ష కథల సంపుటి, యశోగీతిక యశో బాలానందం,శ్రీవెంకటేశ్వర స్వామితో నేను అను పుస్తకాల ఆవిష్కరణ సభలో  ప్రముఖ కవి రచయిత కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ అధ్యక్షతన కుసుమధర్మన్న కళాపీఠం  వ్యవస్థాపకురాలు కవియత్రి డాక్టర్ రాధాకుసుమ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కవిసమ్మేళనంలో ప్రముఖ కవి, రచయిత సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్  విశాఖపట్నం "జీవితమే ప్రశ్నల వలయం"అని కవితాగానం చేసినపుడు సరస్వతీ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన ప్రఖ్యాత తత్వవేత్త తెలంగాణ ప్రథమ బి.సి. కార్పొరేషన్ చైర్మన్, విశాల సాహిత్య అకాడమీ అధ్యక్షులు  శ్రీ బి.ఎస్ .రాములు గారు స్వహస్తాలతో  కవి అయ్యలసోమయాజులను దుశ్శాలువ పుస్తకాలతో  శుభాకాంక్షలు తెలియచేస్తు రచయిత్రి డాక్టర్ గొట్టిపర్తి యశోద దంపతులు  ఆత్మీయ సత్కారం చేసారు .సభలోప్రముఖ కవులు డాక్టర్ జెల్ది విద్యాధర్  ఐ.ఆర్.ఎస్. డాక్టర్ వి.డి. రాజగోపాల్  ప్రముఖ గజల్ రచయిత్రి కవయత్రి డాక్టర్ విజయలక్ష్మి పండిట్ ,సాహితీవేత్త శ్రీ రామకృష్ణ చంద్రమౌళి డాక్టర్ కోగంటి ఉషారాణి మరియు డాక్టర్ సరికొండ శాంతిశ్రీ పాల్గొన్నారు.

బదులుగా కవి  ప్రసాద్ -చక్కటి సరస్వతీ సభలో-సౌమ్యులు గురుతుల్యులు  తత్వవేత్త --బి.ఎస్ రాములు గారిచే  సత్కరించబడటం మరువలేని జ్ఞాపకమన్నారు.
.............................
కామెంట్‌లు