నిర్మూలనే....ప్రగతి...! :- .. కోరాడనరసింహా రావు!
బానిసత్వ, కాలుష్య ని యంత్రణ...నివారణలు
ప్రపంచ ప్రశా0తజీవనానికి  అత్య0తావస్యకములు...!

అవస రానికి పనులు చేయించుక మూల్యం చెల్లించాలే గానీ... 
   ఒక మనిషిని ఇంకో మనిషి బలవంతముగా బానిసను చేసు కుని , చాకిరీ చేయించుకోటం అమానుషమె కదా...! 

ధనము, బలము ఉన్న వారు... అమాయకులను, బలహీనులను ..బానిసలనుచేసుకుని గొడ్డు చాకిరీ చేయించు కునే జమీందారీ
పెత్త0దారీ సా0ప్ర దాయం
 గతించినా... 
  ఈ నాటి కీ అక్కడ క్క డా  అప్పు డప్పుడూ... 
  అమాయకులను, అర్భకులనూ  బానిసలను చేసి వెట్టి చాకిరీ చేయించు కోటం గమనార్హం...! 
   స్వేచ్చారహిత బానిసత్వ బ్రతుకులు... 
 అన్యాయము, అధర్మమే కాదు, మహా పాపంకూడా! 

ఇది భూ, జల, వాయు కాలుష్యాలకంటే.... 
  హేయమైనది... నీచమై నది , అతి భయంకర మైనది 
  బానిసత్వము, కాలుష్య ము ఈ రెండూ అభివృద్ది నిరోధకాలు...! 
   వీటిని ఎంత తొందరగా నిర్మూలిస్తే... ప్రజలకు, దేశానికీ అంత మంచిది!! 
  వీటి నిర్మూలనకై బాధ్యతగా ప్రతిఒక్కరూ
చిత్త శుద్దితో ప్రయత్నించ వలసిందే....! 
  ఆరోగ్యకరమైన సమాజానికి ఇది అత్యం తావశ్యకం....! 
     *****


కామెంట్‌లు