కేరళ! అచ్యుతుని రాజ్యశ్రీ

 తిరువనంతపురం రాజధాని.రాష్ట్ర భాష మలయాళం.పక్షి గ్రేట్ హార్న్ బిల్.జంతువు ఏనుగు,రాష్ట్ర పూవుగోల్డెన్ షవర్ ట్రీ.టీ,కాఫీ రబ్బరు,సుగంధద్రవ్యాలకి ప్రసిద్ధి.చిన్న రాష్ట్రం ఐనా44నదులున్నాయి.క్రీ.పూ.3వేలలోనే వ్యాపార కేంద్రం.కొడుంగలూర్ ప్రాచీన వ్యాపార కేంద్రం.ఒకటో శతాబ్దంలో యూదులు( జ్యూలు) ఇక్కడికి వచ్చారు.సెయింట్ థామస్ వల్ల క్రైస్తవ మత వ్యాప్తి జరిగింది.6_8శతాబ్దాల్లో అరబ్ వ్యాపారుల ప్రవేశంతో ఇస్లాంమతం వృద్ధిచెందింది.5వశతాబ్ది దాకాపాండ్య,చోళ, చేర పాలన సాగింది.క్రీ.శ.800_1100దాకా రెండో చేర రాజ్యంగా పేరుగాంచింది.ఆతర్వాత చిన్న రాజ్యాల కొట్లాట ప్రారంభమైంది.1498లో పోర్చుగీస్ ఆపై డచ్ వ్యాపారులు వచ్చారు.త్రివాన్కూర్ రాజు మార్తాండవర్మ డచ్ వారిని ఓడించినా బ్రిటిష్వారి పాల్పడింది.1956లోకొచ్చిన్ తిరువాన్కూర్,మలబార్ కల్సి కేరళ రాష్ట్రం ఏర్పడింది.కలరిపయట్టు ప్రాచీన  మార్షల్ ఆర్ట్.కథాకళి ప్రముఖ నాట్యం.కేరళని*గాడ్స్ ఓన్ కంట్రీ* అని పిలుస్తారు.కృష్ణన్ అట్టం, కూడి అట్టం, మోహినిఅట్టం, తుల్లాల్,ఒప్పన, చవిట్టునాటకం..ప్రధాన నృత్య రీతులు. సాంప్రదాయ సంగీతం సొపనమ్, ఆపై స్వాతితిరునాళ్ రామవర్మ తిరువాన్కూర్ రాజువల్ల కర్ణాటక సంగీతం వృద్ధిచెందింది. ఓణం ముఖ్య పండగ.ప్రముఖ చిత్ర కారుడు రాజా రవివర్మ 🌹
కామెంట్‌లు