"నేను... నేను... నేను...":- - యామిజాల జగదీశ్
నేను సంపాదించాను, 
నేను కాపాడాను, 
నేను ఇల్లు కట్టాను, 
నేను సహాయం చేసాను, 
నేను సహాయం చేయకపోయుంటే అతను ఏమయ్యే వాడు!!

నేను పెద్దవాడిని.
నేనే ఉద్యోగం ఇప్పించాను....ఇలా ప్రతి విషయంలోనూ
నేను నేను* నేను* అంటూ గొప్పలు చెప్పుకునే వ్యక్తుల్లారా!!!...

నా హృదయాన్ని నేను నడిపిస్తున్నానని చెప్పగలరా?

నేను నా మెదడును నడిపిస్తున్నానని చెప్పగలరా?

నేను నా రెండు మూత్రపిండాలను నడిపిస్తున్నానని చెప్పగలరా?

నేను నా కడుపులో తినే ఆహారం నుండి పోషకాలను వేరు చేసి రక్తంలో కలుపుతున్నానని చెప్పగలరా?

నేను పువ్వులను వికసించేలా చేస్తానని చెప్పగలరా? 

నేను కూరగాయలను పండ్లుగా మారుస్తానని చెప్పగలరా?

సముద్రంలో జాలరి వలలో చేపలను చిక్కేలా నేనే చేస్తున్నాను అని చెప్పగలరా? 

ఈ పనులన్నీ చేసే లేదా నిర్దేశించే వ్యక్తికి మాత్రమే "నేను" అని చెప్పే అధికారం, హక్కు ఉంది. ఆయన మరెవరో కాదు,  అతనే‌ "భగవంతుడు".

కాబట్టి, నేను అనే అహంకారాన్ని విడిచిపెట్టి  అందరితోనూ ప్రేమగా ఉండాలి. ప్రేమ అన్ని బాధలను మటుమాయం చేసే తాళం. కాబట్టి ప్రేమే శివుడు. ప్రేమే సౌందర్యం.

ప్రేమతో నేను అని కాకుండా మనం అని చెప్పుకుందాం


కామెంట్‌లు
Popular posts