పొడుపు గేయం :- ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
కంటికసలు  కానరాదు 
వెంట తిరుగుతుంది
ఇసుక వోలె జారుతుంది
జలమోలే పారుతుంది 

కట్ట వేయలేను 
దాన్ని ఆపలేను 
మబ్బుల్లో తేలుతుంది  
ఆకాశాన ఎగురుతుంది   

అదుపులోన నిలువక 
ఆగమాగం చేస్తుంది 
అందకుండా పోతుంది
అందలమెక్కిస్తుంది 

ఆగాధములో నెట్టేస్తుంద 
గొంతెమ్మ కోరికలతో 
గాలి మేడలు కట్టిస్తుంది 
అది ఏమిటో తెలపండి
గేయం లోని గుట్టు విప్పండి 




కామెంట్‌లు