సామెత -101: - అన్నేమో గని అగ్గి శేషం, అప్పు శేషం ఉండగూడదు.
***
"అవ్వా!గీ సలికాలంల ఎవ్వలైనా ఎంత జాగర్తగ ఉండాలె చెప్పు.సుక్క పొద్దు పొడ్వక మున్పే లేత్తుండ్రు. చితుకులు పోగేసి సక్కగ సలిమంట కాత్తుండ్రు.గంతొర్కు బాగనే ఉంది గని ఆటెంక గా అగ్గి ఆర్పకుండనే ఎవలి దార్న ఆళ్ళు బోతుండ్రు.గియ్యాల మనింటెన్కాల రాజక్క మన్వరాలు గదే అవ్వా!గా మూడేండ్ల బుడ్డపొల్ల దొడ్లె ఏసి ఒదిలేసిన సలిమంట కాడ్కి బోయిందట.పైనంత బూడిదె ఉండే తల్కి ఆటొత్కే గా బూడిద శేతిల పట్కుందామని ముందుకు బోయిందట. లోపల అగ్గిరవ్వలు శేతికి,అరికాళ్ళకి అంటుకొని లబ్బ లబ్బ మొత్కుంటుంటే ఉర్రికి బోయి శూసేతల్కి లేత శేతులు, అరికాళ్ళు బొగ్గలొచ్చినయంట."
గబ్బ గబ్బ దవాఖానాకి తోల్కబోయిండ్రు.గవి తగ్గే తల్కి శానా దినాలు పడ్తుందని పైన పూత మందు రాశి ఇచ్చిండ్రంట డాటరు.గిప్పుడే అటుబొయ్యి సూసొత్తున్న. గా సంటిపొల్ల అవత్త సూత్తుంటే మస్తు దుఃఖమొచ్చిందవ్వా!" కొంగుతో కళ్ళు తుడ్సుకుంట అంటున్న నాగరత్తమ్మొంక సూత్తూ...
"అయ్యో! శెల్లె! ఎంత పనైంది! గీ సలికాలంల గింత దెబ్బ తగిల్తెనే సలికి యిర్రుమని నొప్పి లేత్తది. గస్మంటిది,గా బొగ్గలకి ఎంత నొప్పి లేత్తుండొచ్చు.గా సంటిది ఎట్ల తట్టుకుంటదో ఏమో! అటిటు ఉర్కులాడే వొయసు.ఎట్లనో ఏమో? గందుకే అగ్గి శేషం ఉండొద్దంటరు.ఉంటె గిట్లాంటియే కాదు అగ్గి రవ్వలు గాలికి రాజుకొని ఏ గుడిశెల మీద పడ్డా ఇంకేమన్నుందా" శెల్లె!
అక్కడే కూసోని పరంపద సోపానం ఆడుకుంటున్న బుడ్డోడు గీళ్ల మాటలు యిని"నేనైతె ఈ ఇగానికి చ్వెటరేసుకుని బడ్కి బొయ్యే సైమమైందనుక అర్రల్నించి బయిటికి రాట్లే గదవ్వా! అంటుంటే...
భూలచ్మి ఎంటనే "గంద్కే అవ్వా! గీనివల్లే బడ్కి ఆలీశమైతంది.సార్లు దినాం జెప్పుడే పార్థనకి రావాలెనని.నాలెక్క అరికంట్లం గట్ట్కొని నీ యెంట తిర్గుతుంటె ఇగముండదు- గిగముండదు కదవ్వా!"అంటుంటే...
అవ్వ,నాగరత్తం నవ్కుంట"అవుమల్ల.పొద్దుగాల లేత్తే సలిగిలి ఏముండవ్ రా బుడ్డోడా!అక్క లెక్క రేపట్నించి నువ్వు సుత పొద్దుగాల లెవ్వాలె మరి" అంటుంటే..."సరే తీ! లేత్త తీ అవ్వా!అన్కుంట ఆటలో మున్గిండు.
"అగ్గి శేషం ఒక్కటే గాదు శెల్లె!అప్పు శేషం సుత అస్సలు ఉండొద్దు".గదున్న కానించి కంటి నిండ నిదుర పట్టదు.కడ్పు నిండ తిండి సయించదు.అప్పు తీర్సకపోతే అందట్ల పర్వుబోతదనే బయం ఎంటాడ్తది.గంతే గాదు శెల్లె!అప్పిచ్చినోళ్ళకు ఇత్తనన్న సైమానికి యియ్యకపోతే గాళ్ళ ఏడ్పు, తిట్లు తగులుడు ఉంటయి. గందుకే కలోగంజో అప్పుసప్పు లేకుండా ఉన్నంతల బత్కడం కంటే తుత్తి ఇంకేముంటది."
అగ్గి శేషం,అప్పు శేషం...గీ రొండు ఉండకుండ సూసుకోవాలెనని మన పెద్దోళ్ళు అనుభవంతో శెప్పిండ్రు.గియ్యీటిని పతొక్కరు మతికిల బెట్టుకోవాలె శెల్లె" అన్న అవ్వ మాటల్కి అవునవ్వా! అని తలూపింది నాగరత్తం".
గదండీ సంగతి! అగ్గి శేషం,అప్పు శేషం లేకుండ పశాంతంగ బత్కుదాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి