స్రవంతి అన్నం సరిగా తినదు. తనకు ఇష్టమైన కూరలు ఏ రెండో మూడో! ఆ కూరలు ఉంటే తప్ప ఏ కూరలు వండినా అన్నం సరిగా తినకపోయేది. పాఠశాలలో ప్రతిరోజూ మధ్యాహ్నం లంచ్ బాక్సులోని అన్నం పారబోసేది.
ఇది గమనించిన శ్రుతి అనే అమ్మాయి స్రవంతితో "ఎందుకు ఇలా రోజూ అన్నం పారబోస్తున్నావు." అని అడిగింది. తనకు నచ్చని కూరలే రోజూ అమ్మ చేస్తుందని ఏడ్చింది శ్రుతి. కూరల విలువ ఆరోగ్యానికి ఆవి ఎలా ఉపయోగపడతాయో వివరించింది శ్రుతి. ఇది స్రవంతికి నచ్చలేదు. "పోనీ అలా పారబోసే బదులు నాకు ఇవ్వు. నేను తింటా." అన్నది శ్రుతి. ఆ కూరలు నువ్వూ తినలేవు." అన్నది స్రవంతి. "తింటా చూడు. పందెం?" అన్నది శ్రుతి.
ప్రతిరోజూ శ్రుతి ఎంతో ఇష్టంగా లొట్టలేసుకుంటూ మరీ భోజనం చేయడం లయ గమనించింది. లయ శ్రుతిని బతిమాలి ఆ భోజనంలో వాటా కావాలని కోరిది. శ్రుతిలయలు ఇద్దరూ లొట్టలేసుకుంటూ స్రవంతి తెచ్చుకున్న లంచ్ పంచుకొని తినేవారు. ఏ కూర తెచ్చుకున్నా ఇంతే. లయ కూడా లొట్టలేసుకుంటూ తింటూ ఉండటం స్రవంతిని ఆశ్చర్యానికి గురి చేసింది.
"నిన్న నువ్వు బడికి రాకపోవడం మమ్మల్ని నిరాశపరచింది. ఆ బాధతోటి ఎవరితోనూ మాట్లాడలేదు." అన్నారు శ్రుతిలయలు. స్రవంతి ఆలోచనలో పడింది. నిజంగా తన అమ్మ చేసిన వంట అంత రుచిగా ఉంటుందా? ఇష్టంగా అమ్మ వండిన కూరలు తినడం మొదలు పెట్టింది స్రవంతి. అవును. అమ్మ వండిన వంట అమృతమే.
గుణపాఠం : - సరికొండ శ్రీనివాసరాజు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి