దశమాత వ్రతం: -డా.చీదెళ్ళ సీతాలక్ష్మి-విశ్రాంత సహాయాచార్యులు-హైదరాబాద్-9110347693

   మన భారతదేశం వేదభూమి ,కర్మభూమి.వివిధ సంస్కృతుల సమ్మేళనం.ఒక్కో ప్రాంతంలో ఒక్కో విశేషం. రాజస్థాన్ అందమైన ప్రదేశం,ఎడారి ప్రాంతం.పింక్ సిటీ అని పేరు గాంచింది.మార్బుల్ రాతికి ప్రత్యేకం. అయితే ఇప్పుడు ఒక విషయాన్ని తెలుసుకుందాం.
దశ మాత (దశమా మాత) పూజ కుటుంబ శ్రేయస్సు, సంపద మరియు సంతోషం కోసం చైత్ర మాసంలోని కృష్ణ పక్ష దశమి రోజున జరుపుకునే అత్యంత పవిత్రమైన వ్రతం. ఈ రోజున 10 ముడులతో కూడిన దారాన్ని (దశ పవిత్ర దారం) పూజించి, కథ వినడం మరియు కుటుంబానికి మంగళకరం జరిగేలా ప్రార్థించడం ప్రధాన ఆచారం .రావి వేప చెట్లకు మన హస్తినాపురం ఆలయంలో మార్వాడీ మాతలు చేసిన దశమాత పూజ..అమ్మవారికి చేసే పూజార్చన. సంవత్సరానికి ఒకసారి రాఖీ పౌర్ణమి తర్వాత చేసే వ్రతం.
      కామదహనపప్పుడు అగ్ని దేవుని చుట్టూ.చుట్టిన దారాన్నిఈరోజు దశమాత వ్రత కథను చదివి పూజచేసిన తర్వాత పసుపుతాడును ముత్తైదువలు మెడలో ధరిస్తారు.ఇది ప్రతి సంవత్సరం చైత్రమాసంలో కృష్ణ పక్షం దశమి తిథి నాడు చేసే గొప్ప పండుగ.
   ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకుని స్నానాదులు ముగించుకుని కొత్త దుస్తులు ధరించి ,పూజా స్థలాన్ని శుద్ధి చేసుకుని పూజ ముగిసిన తర్వాత గోడకు పది  కుంకుమ,పసుపు చుక్కలు పెడతారు.
   ఈరోజు ప్రత్యేకంగా కొత్త వస్తువులు,కొత్త చీపుర్లు  కొనడం వీరి సంప్రదాయం. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని వారి నమ్మకం.ప్రగాఢ విశ్వాసం.రాజస్థాన్ మార్వాడీ సంప్రదాయం ననుసరించి తెలుగు తిథులకు 15 రోజులు ముందుగానే వారికి చైత్రమాసం వచ్చింది.పౌర్ణమి వారికి అమావాస్య తర్వాత పాడ్యమి నుండి వాళ్లకు..15 రోజులు తేడా.
 దశ అంటే మన దశను మార్చే పద్ధతి .పూజలు చేస్తే దశ తిరుగుతుందని నమ్మకం. దశ అంటే పది అని అర్థం.అమ్మవారి గురించి పది కథలు చెప్పుకుని చేసే వ్రతం..ఈ రోజు వారిని కలిసి తెలుసుకోవడం ఆనందంగా ఉంది.ఇలా మీతో పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. 🎉
--------------

కామెంట్‌లు