భువికి పండుగలా
దిగివచ్చే వేకువలో
ప్రేమ నిండిన స్పర్శ తో
రాలుపూల తల నిమిరే....
వెలుగు పంచుతూ
ఇలను మేలుకొలుపుతూ
కలకల సవ్వడి చేసే
గువ్వలను కుశలం అడిగి.....
వేల పూల పరిమళంలో
డోలలూగే చల్లగాలిని
ఈల వేస్తూ సాగిపోమ్మని
తల ఊపి సైగ చేసి ......
రంగులెన్నో నింపుకున్న
అవని మీది సుమాలకు
అతిశయమేదో అద్ది
ఆప్యాయంగా తడిమి .....
పచ్చని పచ్చికలే
పట్టుపుట్టములుగా చుట్టి
నవ వధువై కళగా
వెలిగే వసుమతిని దీవించ
ఏడు గుర్రముల తేరుపై
ఏతెంచు ఏలికకై
ఎన్ని ఆశలతోనో
ఎదురుచూచు మేదినికి....
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి