మనిషి కన్నా మెరుగ్గా జీవించాలని
మనిషి కన్నా స్వార్ధంగా జీవించాలని
నిస్వార్థ మొక్క
స్వార్ధంగా మారింది.
మొక్కకు కుక్కలా-విశ్వాసంగా ఉండాల్సిన -
మనిషి
కృతజ్ఞత కూడా లేకుండా
ఉండిపోతుంటే.
మొక్కకు మనిషికి మధ్య మనిషిని తొలగించి
మొక్కలే వ్యాపారం చేస్తున్నాయి.
పూలు పండ్లు కూరగాయలు ధాన్యాలు
విత్తనాలు అమ్మే దళారులు ఇప్పుడు
మొక్కలే
మొక్కల హక్కులన్నీ ఇప్పుడు మొక్కలకే
మొలకెత్తడానికే భయపడే మొక్కలే
మొట్టమొదట మొలకెత్తుతున్నాయి
సంపదను తలకెత్తుకున్నయి.
తమ కష్టం తమ అదృష్టం తమ సృష్టి
తమకే దక్కాలని స్వార్ధాన్ని తలకెత్తుకున్నాయి.
హక్కుల కోసం మొక్కలన్ని ఒక్కటైనవి
విచిత్రం
మొక్కకు మనిషికి మధ్య మనిషి కాదు
ఇప్పుడు మొక్క వచ్చి చేరింది
స్వార్థం -వ్యాపారం -జోరందుకుంది.!!?
డా ప్రతాప్ కౌటిళ్యా.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి