జీవరసాయన శాస్త్రవేత్త ఖోరానా: - - యామిజాల జగదీశ్
 అది వలస రాజ్యాల పంజాబ్‌లోని ఓ కుగ్రామం.‌ అక్కడ, ఒక కుటుంబం మాత్రమే అక్షరాస్యత కలది.
1922వ సంవత్సరం. రాయ్‌పూర్‌లో జనన రికార్డులకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఇది చాలా చిన్న స్థావరం. దీని పేరు అప్పట్లో ఏ మ్యాప్‌లోనూ నమోదు కాలేదు. కానీ బ్రిటిష్ పాలనలో పని చేస్తున్న ఒక వినయపూర్వకమైన ట్యాక్స్ గుమస్తా ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయమే ఇప్పటికీ ఆ గ్రామాన్ని గుర్తు చేసుకునేలా చేసింది.
ఆయన పిల్లలు ఓ క్రమపద్ధతిలో నేర్చుకున్నారు. 
ఆయన ఇరుగు పొరుగు వారికి కనీసం తమ పేరుకూడా రాయడం తెలీదు. పొలాల్లో శ్రమిస్తుండేవారు. అయితే ఈయన తన కుమారుడు హర్ గోవింద్ ఖోరానా పాఠశాలకు వెళ్లేలా చేశాడు. తాను సంపాదించిన కొద్ది మొత్తాన్ని ఇందుకోసం ఖర్చు చేశాడు.
అయితే నాటి సౌకర్యాలు చెప్పుకోదగ్గ రీతిలో లేవు. వనరులు ఆచరణాత్మకంగా లేవు. కానీ ఆ బాలుడు వీటన్నింటినీ గ్రహించాడు.‌ చదువు మీదే దృష్టి పెట్టాడు.
ఖోరానా ఉన్నత పాఠశాల పూర్తి చేయడమే కాకుండా లాహోర్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి కెమిస్ట్రీలో బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీలను సంపాదించాడు. 
తరువాత, 1945లో, అతను భారతదేశం నుంచి ప్రభుత్వ ఫెలోషిప్‌పై లివర్‌పూల్ విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టాడు. మూడు సంవత్సరాల తరువాత, అతని డాక్టరేట్ పొందాడు.
ఆ తర్వాత జరిగినది స్టాంపులతో నిండిన పాస్‌పోర్టులాగా చదివే శాస్త్రీయ ప్రయాణం. మరో ఏడాదికి జ్యూరిచ్. మరో రెండు సంవత్సరాలకు కేంబ్రిడ్జ్. 1952లో వాంకోవర్. అక్కడ అతను ఫాస్ఫేట్ ఎస్టర్లు, న్యూక్లియిక్ ఆమ్లాల రహస్యాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. తరువాత యునైటెడ్ స్టేట్స్, చివరికి విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయంలో స్థిరపడ్డాడు.
అక్కడే, మాడిసన్‌లో, ఖోరానా జీవశాస్త్రానికి సంబంధించి అత్యంత ప్రాథమిక రహస్యాలలో ఒక దాన్ని కనుగొన్నాడు.
జన్యు సంకేతం వాస్తవానికి ఎలా పని చేస్తుందో అతను అర్థం చేసుకున్నాడు. DNA సూచనలు ప్రతి జీవిని నిర్మించే, నడిపించే ప్రోటీన్లలోకి ఎలా తమ వంతు పాత్ర పోషిస్తాయో తెలుసుకున్నాడు. 1968లో, ఈ సంచలనాత్మక పని కోసం అతను మార్షల్ నిరెన్‌బర్గ్ రాబర్ట్ హోలీతో కలిసి శరీరధర్మశాస్త్రానికి సంబంధించి వైద్యంలో నోబెల్ బహుమతిని పంచుకున్నాడు.
అక్షరాస్యత అరుదుగా ఉన్న గ్రామం ఇతను సాధించిన విజయాలతో ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ఆ గ్రామం గురించి ప్రపంచానికి తెలిసింది.
భారతీయ అమెరికన్ జీవరసాయన శాస్త్రవేత్త అయిన హర్ గోవింద్ ఖోరానా 1922  జనవరి 9వ తేదీన జన్మించాడు.‌ 2011 నవంబర్ 9న తుదిశ్వాస విడిచాడు.  


కామెంట్‌లు