ఈ రోజుల్లో ఎక్కువ మంది స్త్రీలు అనేక రకాల మానసిక ఒత్తిడులు, శారీరక రుగ్మతలకు గురవుతున్నారు. థైరాయిడ్, అధిక బరువు, బిపి, మోకాళ్ల నొప్పులు, మెడ, వెన్నెముక నొప్పులు, రుతు క్రమంలో అపసవ్యతలులాంటి అనేక సమస్యలకు తరచుగా గురవుతున్నారు. యోగసాధనతో వీటి నుంచి బయటపడి సంపూర్ణారోగ్యాన్ని మన సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
యోగాభ్యాసం మొదలుపెట్టే ముందు ముఖ్యంగా పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి. యోగసాధన చేసే ముందు మలమూత్ర విసర్జన తప్పనిసరి. యోగసాధనకు 20 నుంచి 30 నిముషాల ముందు మంచినీరు తాగటం అలవాటు చేసుకోవాలి. స్త్రీలు బహిష్టు సమయంలో యోగాభ్యాసం చేయకూడదు. ముఖ్యంగా ప్రశాంతమైన మనసుతో చేయాలి. మనసులో ఒత్తిడులు, కోపం, భయం, అయిష్టత, మొదలైనవి ఉన్నపుడు యోగసాధన చేయకూడదు. జ్వరంతో ఉన్నపుడుగాని, అధిక బి.పి ఉన్నపుడుగాని ఆసనాలు అసలు వేయకూడదు.
యోగా చేయడానికి ముందు కాఫీ, టీల లాంటివి తీసుకోకూడదు. శరీరాన్ని పట్టి ఉండే బిగుతైన దుస్తులు ధరించ కూడదు. సాధ్యమైనంత వరకు వదులుగా ఉండేలా కాటన్ దుస్తులు వేసుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు అనుభవజ్ఞులైన యోగ శిక్షకుల సమక్షంలో యోగా భ్యాసం చేయటం మంచిది. శబ్దకాలుష్యం, వాయుకాలుష్యంలేని ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి యోగసాధన చేయాలి.
గాలి, వెలుతురు ఉండే విశాలమైన గదిలోగాని, ఆరుబయట గాని మేడపైన గాని యోగాభ్యాసం చేయాలి. ఉదయం, సాయంత్ర సమయాల్లో రెండు సార్లు యోగసాధన చేయాలి.
బ్రహ్మి ముహూర్త సమయంలో ధ్యానం చేయటం చాలా మంచిది. యోగా చేసేవారు చలికాలంలో గోరువెచ్చని నీటిని తాగాలి. యోగసాధనకు భోజనానికి మధ్య ఐదు నుంచి ఆరు గంటల వరకు కాలవ్యవధి ఉండాలి. అంటే భోంచేసిన ఐదు లేదా ఆరుగంటలలోపు యోగా చేయకూడదు. అనుభవజ్ఞులైన శిక్షకుల సమక్షంలో యోగా భ్యాసం నేర్చుకున్న తరువాతే స్వయం సాధన చేయటం చాలా మంచిది. నేలమీద యోగసాధన చేయకూడదు. మెత్తని బెడ్‌షీట్ గాని కార్పెట్‌గాని వేసుకోవాలి. గర్భిణులు ప్రాణాయామం, సూక్ష్మ వ్యాయామం మాత్రమే చేయవచ్చు. ఆసనాలు వేయకూడదు. వీరికి నడక చాలా మంచిది. యోగసాధన సమయంలో మధ్యలో నీళ్లు తాగకూడదు. యోగసాధనకు 20 నిముషాల ముందుగాని లేదా పూర్తయిన 20 నిముషాలకు తరువాత గాని తాగాలి. యోగాసనాలు క్రమపద్ధతిలో వేయాలి. ముందుగా సూక్ష్మవ్యాయామంతో ప్రారంభించి ఆసనాలు, సూర్యనమస్కారాలు, ప్రాణాయామం తదుపరి ధ్యానంతో ముగించాలి. ఏవైనా శారీరక రుగ్మతల కారణంగా కింద కూర్చోలేని వారు ఏదైనా బల్లపై కూర్చుని యోగసాధన చేయాలి. కనుక క్రమపద్ధతిలో యోగా చేసి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి