రాబందుల రక్త సంతకం..!: - కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
ప్రపంచం
అట్టుడుకుతోంది
యుద్ద విమానాలతో
ధరణి దద్దరిల్లుతోంది

ఫిరంగుల మోత
నింగిలో నిప్పుల వాన
బాంబుల వర్షం బంకర్లపై దాడి
అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్
త్రిముఖవార్ ప్రతిఫలమే
ఈ దారుణ మారణహోమం...
ఇరాన్ అధ్యక్షుడు ఖొమైని దుర్మరణం

శాంతికపోతాల రెక్కలు తెగి
ఆకాశం రక్తవర్ణమై కన్నీరు పెడుతోంది
అదిగో డ్రోన్లు మిస్సైల్స్ గగనతలాన మృత్యుశకటాల్లా దూసుకొస్తున్నాయి
జనవాసాలపై విరుచుకు పడుతున్నాయి

రక్తపాతాలతో
రక్తస్నానం చేయాలని
రాజ్యాలను ఆక్రమించాలని
రక్త చరిత్రలు సృష్టించాలని

అత్యాధునిక
మారణాయుధాలతో
అహంకారంతో
అగ్రరాజ్యాల నేతలు
రాక్షసుల్లా రాబందుల్లా
భారీ భవన శిథిలాల్ని చూస్తూ
చిరునవ్వులు చిందిస్తూ
అసువులు బాసిన అమాయకుల
సమాధులపై రక్తసంతకాలు చేస్తున్నారు

పరాభవ నామ సంవత్సరం
తొలి ఉషస్సులోకి
తొంగి చూస్తూంది...
తొలి అడుగులేస్తుంది...
విద్వేషానికి విధ్వంసానికి విందునిస్తుంది
నేడు ఉగ్రరూపందాల్చిన అగ్రదేశాధినేతల
పగా ప్రతీకారాలకు పట్టాభిషేకం చేస్తుంది

ఐనా ప్రపంచ శాంతి కోసం
శాంతి కపోతాల నెగురవేస్తూ...
ఆహ్వానం పలుకుదాం...ఆశతో...
పరాభవ నామ తొలి తెలుగు ఉగాది\
 పర్వదినానికి...స్వాగతం...సుస్వాగతం.


కామెంట్‌లు