సామెత -161: ఆశగలవ్వ దోషమెరుగదు - పూటకూళ్ళవ్వ పున్నెమెరుగదు
****
"ఏం! మడుసులో ఏమో?దినాం దినాం మడుసులు ఆశ పాతకులైతున్నరు. పొయ్యేటప్పుడు. సూది మొనంతన్న కట్కపోతరా అవ్వా!మంది నోళ్ళు గొట్టి కూడబెట్టి తింటే గా కూడు ఒంటికి యిముడ్తదా అవ్వా! నువ్వే శెప్పు."
"ఏంది శెల్లె! మడుసుల మీద గంత కోపమొచ్చింది? మడిశంటెనే ఆశ. ఆశంటెనే మడిసి. ఏదన్న సంపాయిచ్చుకోవాలన్నా, సాధిచ్చుకోవాలన్న మడిసికి ఆశ ఉంటేనేగా సాజ్జమయ్యేది!"
"అవునవ్వా! గదాన్ని ఎవ్వడు కాదంటడు గని ఆశకి సుత అద్దుండాలె గద.మందిని ముంచి,గాళ్ళని పడగొట్టి,బాద పెట్టి సంపాయిచ్చే ఆశ మంచిదా? నువ్వే శెప్పు అవ్వా!
అవును శెల్లె! ఆశకి అద్దుండాలె.గది లేకనే గీ దునియాల చాన మంది చెడ్డోల్లు అయితుండ్రు. ఎంత తప్పైన చేత్తుండ్రు. దేనికైనా తెగిత్తుండ్రు.గాళ్ళకి అమ్మ ,నాయిన,అక్క అన్న బందాలే ఉండట్లే. ఎవలన్న గాని గాల్లనెట్ల ముంచుదామా?పొద్దత్తమానం గదే పోబడి.గీ పాడు ఆశతో తప్పేదో ఒప్పేదో తెల్వట్లే.
ఇగ్గో గిప్పుడు నా దారికొచ్చినవ్.గా దానయ్య మావ ఉండుగా. గాయన పేర్లనే దానం గని ఎన్నడన్న ఎంగిలి శేత కాకిని గొట్టిండా? పైసా పైసా కూడబెట్టడానికి ఎంతకైన తెగిత్తడు. గస్మంటివి జేసేటప్పుడు మంచి శెడు ముచ్చటే లేదు.అన్ని తప్పులే జేసుడు.
కొంతమంది వొచ్చిన జీతం సాలట్లే అని బల్లకింద శేతులు బెట్టుకుని కొందరు. పైసలిత్తనే పన్జేత్తమని దవాఖాన్ల పంజేసే జేసేటోళ్ళు కొందరు రోగుల్నీ పట్టీ పీడిచ్చి వసూలు జేసుకునేటోళ్ళూ ఇంకొందరు. గిట్ల దుష్టమైన ఆశ తీర్సుకొనేటందుకు శెడ్డ దారి ,అడ్డదారి తోక్కేటోళ్ళు కొందరు.గిట్ల రకరకాలుగ ఉండ్రు.
అవును శెల్లె! గందుకే ఆశగలవ్వ దోషమెరుగదు - పూటకూళ్ళవ్వ పున్నెమెరుగదు " అంటరు."
"దానయ్య మావ సరుకుల దుకణం బెట్టి ఎన్ని మోసాలు చేత్తండో తెల్సుగ.ఉద్దెర బెట్టుడు గందుల ఇచ్చినవే మల్లిచ్చినట్టు పక్కన గలుపుడు.పిల్లాజెల్లా గీ మావకి ఎద్రుసూడకుండ బతుకుతుండ్రు.అయినా గని గంత ఆశ మావకి. గా అతి ఆశే శెడ్డ శెడ్డ పన్లు గాయినతో చేయిత్తంది.
మరి"అవ్వా! పూట కూళ్ళవ్వ మా బాగనే రుశిగ తిండి పెడ్తది, కడ్పు నిండ బెడ్తది గదవ్వా?మరి గామెకు పున్నెమెందుకుండదు?
గామేవన్న ఉచ్చితార్తంగ పెడ్తుందా శెల్లె. పైసలు గడ్తెనే పెడ్తది. పైసల్లేనోడు గా అవ్వ ఇంటికెళ్ళి గింత ముద్ద అన్నబెట్టవ్వాని కాళ్ళా ఏల్లా పడ్డా పెడ్తదా? అస్సలు పెట్టదు గదా! ఇంగ పున్నెమేడినించి వొత్తది శెల్లె.డబ్బుకి తిండి బెట్టే మడిసికి దయా, దర్మం యాణ్ణించి వొత్తయి.
అవునవ్వ?నువ్వన్నది నిజమే.గస్మంటోళ్ళు జేబట్టే మన పెద్దోళ్ళు గిస్మంటి సామెతలు పుట్టిచ్చిండ్రు."
గదండీ సంగతి! "ఆశగలవ్వ దోషమెరుగదు- పూటకూళ్ళవ్వ పున్నెమెరుగదు "అంటే గిదే మరి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి