ఇది తరతరాలహిప్నాటిజమా!? ఏ మో....! : - కోరాడ నరసింహా రావు!
సభ్య సమా జం లో.... 
  మన నిజాభిప్రాయాల వాస్తవ ముఖాలను చూప లేము...! 
   అందుకే...మర్యాదల బురఖాలేసుకు తిరుగు తాము...!! 

వాస్తవాన్ని  వాస్తవమని అందరికీ తెలిసినా.... 
  దాన్ని  బాహాటంగా చె ప్పలేము...! 
  అవన్నీ గిట్టని వారి కల్పనలని కొట్టి పారేస్తాము...!! 

మధ్యలో నాగరికత పేరుతో, మన మేర్పరచు కున్న  
సా0ప్రదా యాల హద్దులకు భంగం కలుగ రాదనే దృడ సంకల్పముతో ఉన్నాము!

ఆత్మ సాక్షి ఔనంటున్నా... 
  బలవంతముగా దాని నోరు నొక్కెస్తాము...!! 

అది సత్యమే ఐ నా... 
  దాన్ని వెల్ల డించ నిచ్చగించము...! 
   ఇది... తర తరాల హిప్నా టిజమేమో...! 
  ఏ మో....!! 
    ******


కామెంట్‌లు