నవమాసాలూ మోసి కనటమే కాదు....
పాలిచ్చి , లాలించి, పోషించి పెంచటమే కాదు...
చేయిపట్టిసక్ర మంగా నడిపిస్తూ....
ప్రపంచాన్ని పరిచయం చేసే తల్లి...!
తప్పొప్పుల బుద్దులు చెప్పి ...మంచిగా తీర్చి దిద్దే తల్లి....!
బిడ్డకు బాధ కలిగితే తల్ల డిల్లి పోతు...కన్నీరు గా కరిగి పోయే తల్లి....!
బిడ్డల భవిష్యత్తు కోసం ఇంట, బయట... అలుపు, అలసట..
.తెలియక, విసుగు, విరామం కోరక అహర్నిశలు పరితపించే తల్లి...!
అట్టి తల్లిగాక.... వేరెవరు ఈ ఇలలో ప్రాణులకు... అందునా మనుష్యులకు ప్రత్యక్ష దై వం...!!
కనుకనే అమ్మ "మాతృ దేవో భవ" అని కొనియా డ బడు తోంది... పూజింప బడుతోంది....
అమ్మతరువాత అంత గొప్ప గౌరవం దక్కినది...
భూమాత... గోమాత... గంగా మాతలకే .....!!
ఓం శ్రీ మాత్రే నమః!
******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి