నాగపూజ! అచ్యుతునిరాజ్యశ్రీ

 అనాదిగా ప్రకృతిని పూజించే దేశం మనది. ముఖ్యంగా సర్ప నాగపూజలు పర్యావరణ పరిరక్షణ కు ఆధారం.ఎలుకలు క్రిమికీటకాలవల్ల పంటలు నాశనం కాకుండ పొలాల్లో పాముల పుట్టలని అలాగే ఉంచేవారు.జపాన్,పర్షియా,ఆఫ్రికా,అమెరికా,స్వీడన్ లాంటి దేశాల్లో పాముల గూర్చిన కథలు,నాగపూజ చేయటం ప్రసిద్ధిగాంచినది.గ్రీక్ లో నెపాలోనియా ద్వీపంలో 2చర్చీలున్నాయి.ప్రతిఏటా ఆగస్ట్ 6 _15వరకు రకరకాల విష విషసర్పాలు కొండల్లోంచి బైట కొచ్చి చర్చీలవైపు వెల్తాయి.అది చూట్టానికి ప్రపంచం నలుమూలల నుంచి యాత్రికులు రావటం గొప్ప విషయం.పైగా ఆపాములు ఎవరినీ కరవవు. 
మహారాష్ట్ర లోని*బత్తీశశిరాశ* అనే ప్రాంతంలో సజీవ సర్పాలకు పూజ చేస్తారు.సర్పాల్ని ఊరేగించటం, పాములను మెడలో వేసుకోటం ఆచారం! గ్రీక్ దేవత ఎస్కులిన్ చేతిలోని కర్రకు పాము చుట్టుకుని ఉంటుంది.బుద్ధవిగ్రహం వెనకాల పాముపడగపట్టిన శిలావిగ్రహాలున్నాయి.మన మెదడు తలలోపాముపడగ ఆకారంలో ఉంది దేహనరాలన్నీ ఇక్కడ నించి వెన్నెముక వైపు దిగుతాయి. రాహువు సర్పానికి సంకేతం .ఆంధ్రప్రదేశ్లో విజయవాడ దగ్గర నవులూరు అనే ప్రాంతంలో  కార్తీక మాసంలో రావి వేప చెట్లకు కల్యాణంతో పాటు నాగపూజలు క్రైస్తవ ముస్లిం హిందువులు చేయటం అద్భుతం.కాసు లక్ష్మారెడ్డి అనే ఆయనవంశంలో 3 తరాలుగా ఇక్కడ గుడిలో పూజలు కల్యాణం చేయటం విశేషం.ఇక్కడ నుంచి పానకాలనరసింహస్వామి ఆలయం మంగళగిరి చాల దగ్గర. ప్రకృతిమాత అర్చనతో తరించిన మనభారత్ మహాన్🌷
కామెంట్‌లు