పుస్తకం కాదిప్పుడు హస్తభూషణం
స్మార్ట్ ఫోనే మస్తక, హస్తకభూషణమయ్యింది
ఫోన్ చేతిలో లేకపోతే ఏదో కోల్పోయిన బాధ మనల్ని వెంటాడుతుంది
లోలోపల ఏదో వెలితి
స్క్రీన్ సకలమానవాళికి శ్వాసాంగమయ్యింది
ఫోన్ ఏకాంతాన్నికోరుకుంటుంది
ఒంటరితనాన్ని రేపు బహుమతిగా ఇస్తుంది!?
రేపు నువ్వు సంఘంలో కలవడమే మృగ్యమై పోతుంది
వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో ఊరేగిస్తుంది
పలకరింపులన్నీ ఆన్లైన్ లోనే
ఓదార్పు గీతాలై మార్మోగుతాయి
సింబాలిక్ బ్రతుకు చిత్రాలు
ఏమోజీల్లో సంతోషాలు, సంతాపాలు
మనుషులను బానిసలను చేసుకున్న సాంకేతిక పరిజ్ఞానం
లిప్త పాటు కాలంలో
ప్రపంచంచూపే విశ్వదర్శిని
ఊహలను నిజం చేసే
మాయా దర్పణం
అతి అనర్థదాయకం
టచ్ మీ నాట్ సంబంధాలను
పెంచి పోషించు
వ్యాపారబంధ సేతువే యిది
ఫోనంటే మనకు ఫోబియా కలగాలి
ఫోనంటే కాలహరిణి అనే సోయిమనకురావాలి
ఫోన్ మాయామోసపు మంత్రగత్తె అనే భావన కలగాలి
యువతను పెడదారినతోయు
ఫోనుపై,
ఫోన్ చేయుమేలు,కీడుపై
విరివిగా ప్రచార ,ప్రసార సాధనాలు ద్వారా ప్రచారం జరగాలి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి