ప్రేమ కోసం.!: - డా ప్రతాప్ కౌటిళ్యా.
చెట్టును చూసి 
పిట్ట తల్లడిల్లేది 
అవసరం కోసం కాదు 
చిట్టి ప్రేమ కోసం.!!

చెరువు తనలోని 
చందమామను చూసి 
మురిసిపోయేది 
అవసరం కోసం కాదు 
ఆకాశమంతా ప్రేమ కోసం.!!

చీకట్లో మెరిసే 
నక్షత్రాలు వెలుగు కోసం కాదు 
పగటిలాంటి ప్రేమ కోసం.!!!

తీగకు పూసిన 
పువ్వులు 
కాయల కోసం కాదు 
తీయనైన ప్రేమ కోసం.!!

నవ్వుతూ రాల్చే 
మాటలు 
సొమ్ము కోసం కాదు 
నమ్మకమైన ప్రేమ కోసం.!!

ఆకును తుంచితే కార్చే 
పాల కోసం కాదు 
అమ్మలాంటి రొమ్ము కోసం.!!

ఆవిరీ మేఘమై ఎగిరింది 
నదిగా 
పారడానికి కాదు 
సముద్రమంతా ప్రేమ కోసం.!

రెక్కలొచ్చిన మనసు 
పక్షిలా ఎగరడానికి కాదు 
రెక్కలు లేని మనిషి 
తన కాళ్లపై నిలబడ్డట్లు 
ప్రేమ కోసం.!!?
=============================

 తపస్ ఉపాధ్యాయ నాయకుడు 
డి రాజారెడ్డి గారికి ప్రేమతో
కామెంట్‌లు