ఆ నవ్వును చీకట్లోనో బజారులోనో పడదోసే ఆటవిక తుఫాను
అలల అనుభవం కొత్తగాదు
సాహస నావదే విచిత్ర వైరాగ్యం
కానీ నిత్యం క్షణక్షణం మారే
వేదికపై రంగుల కల
అద్భుత ఇంద్ర మహేద్రజాలాల సింహగర్జన
మెరుపు రంగులు మార్చుకోనప్పుడే ఆశ్చర్యం!
మట్టి లేని గర్భం నీరు లేని నుయ్యి
నేతి బీరలో మాట నెయ్యి మూట
గొంతు పెకలని పొగ వికటిత విద్య!
ఊరు చావడిగాని సంసద్ గానీ
ఉజ్జ్వల భవితకే యోజన
తలపై వాలినా,చెవిలో దూరినా
అందలమెక్కించిన మట్టి నడక ఆలోచనే ప్రశ్న నేలపై
మట్టిని మరిచినా మభ్యపెట్టినా బలమైన శక్తేదో తలకెక్కిన
మూసిన రెప్పల మత్తును ఉతికి ఆరేసే రేపటి జనాగ్రహజ్వాల.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి