వాల్మీకి: -డా. కందేపి రాణీప్రసాద్
బోయవాని బాణం తగిలి 
ప్రాణలోదిలిన క్రౌంచ పక్షులు 
శోకించిన వాల్మీకి నోటి నుండి 
శ్లోకం అప్రయత్నంగా వెలువడెను!

మానిషాద ప్రతిష్ఠాం తొలి శ్లోకమై 
సంస్కృత భాషకు అది కవియై 
రామాయణ మహా కావ్య కర్తయై 
అది కావ్యానికి అద్యుడయ్యేను!

తండ్రి మాట జవదాటని రావాలని 
ఏక పత్నివత్రుడైన శ్రీరాముని 
ప్రయోగిస్తే తిరుగులేని రామాబాణాన్ని 
వాల్మీకి మనకందించి మహర్షయ్యేను!

గర్భవతి మహా పతివ్రత సీతమ్మకు 
అడవిలో ఆశ్రమంలో ఆశ్రయమిచ్చేను 
కుశలవులను పెంచి పెద్దజేసి 
విలు విద్యలన్నీ నేర్పించి తిర్చిదిద్దేను!

కామెంట్‌లు