****
"ఏంది శెల్లే గట్లున్నవ్?గుడ్ల నిండా నీళ్ళేంది? ముక్కులేంది గట్లదరబట్టినయ్?" మద్దేనం పూట గడ్ప తలాపు జేస్కొని జర సేపు అడ్డమొరుగుదామని నడుం వాల్వబోతున్న అవ్వ ,తన పక్కనొచ్చి కూలబడ్డ అనంతమ్మ వాల్కం జూసి ఆచ్చెరింగా, ఆత్రంగా అడిగింది.
కమ్మగ పూట పూటకి వొండి పెడుతుంటే అయ్యకి అర్తం కాట్లే అవ్వా! ఏదో వొంకబెట్టి ఏడ్పిచ్చుడు.అలవాట్లె పొరబాటు అప్పుడో ఇప్పుడో ఎవలికైనా జరుగుద్దా? జరగదా? నువ్వే శెప్పవ్వా? తప్పు నాదైతే శెంపలు వాయిచ్చుకుంట గని " సొదంత ఎల్లబోస్కుంది అనంతమ్మ.
" మల్ల శికాకు జేసిండా మా మర్ది? ఒక్క దినం కూర బువ్వ వొండకుండ సద్దిబొద్ది తిని మునగ దీస్కొని పడుకో! అప్పుడు తెలుత్తది అయ్యకి నీ యిలువేంటో? నీకేమో మొగుడి మీద ఎక్కల్లేని పేమాయె. వామ్మో పొద్దత్తమానం కట్టపడి వొత్తడు.కమ్మగ సేశి పెట్టాలే అన్కుంట రకరకాలయి సేశి పెడ్తున్నవు. మెతుకు లేకుండా తల్లెల బెట్టింది బరాబర్ కాళీ జేస్కుంటనే గిన్నిన్ని మాటలంటుంటే ఎందుకు పడాలె శెల్లె?"
"అవునవ్వా! తల్లె అంత ఊర్సుకొని నాకుతుంటే...ఎంత ఇట్టంగ తింటుండో మా ఆయిన నా శేతి వొంట అని సంబురపడుతుంట. గట్ల పొట్లెంగ తిన్కుంట సుత వొంకలు బెడ్తుంటడు. ఒకట్రొండు దినాలకి శివమొచ్చినోడోలె మన్సిరిగే మాటలంటడవ్వా? ఒక్కో త్యేప గిన్నెడన్నం ఒక్క మెతుకు సుత లేకుండ లాగిత్తడు. అయ్యో! నేను దినేదనుక అద్దినదు. మరి దానికెట్ల అన్న సోయి ఎన్నడన్న ఆయినకుందా? అయిన సుత నేనెన్నడన్న మిగలకుండ తిన్నవేందని అన్ననా? మల్లేమొండుకోనని సల్ల సుక్కతో సరిపెట్టుకున్న దినాలు శాన్నే ఉన్నయవ్వా?"
"ఎందుకుండవు శెల్లే! ఆ అయ్య సంగతి నాకెందుకు తెల్వదు? తినేటప్పుడు నచ్చిన కూరుంటే సాలు.ఎన్కోడికెట్లని యిశారించకుండ లాగిత్తడని వాళ్ళమ్మ మురిపెంగ శెప్తుంటే నాకు మస్తు కోపమొచ్చేది.గా ముచ్చెటి మీ బావకి శెప్తే వొయసొత్తుంటే ఆడే తెల్సుకుంటడు తీ అన్నడు గని గిప్పటి దనుక మారనే లేదన్న మాట.
"యాడ మారిండు అవ్వా? తింటే తిన్నడు గని ఇంట్లె పశాంతం లేకుండ జేత్తుండు.గదే అవ్వా నా బాదంత."
గందుకే శెల్లే! ఒక్క దినం వొండకు అయ్యకు మాడితె గని నీ యిలువ తెల్సొత్తది. గట్లనే శిరిదిండి సుత కంట్లె బడకుండ దాపెట్టు. నేను శెప్పినట్టు యిను. ఆ తర్వాత ఏమన్న లొల్లి జెయ్యేలే నీను జెప్తగద. గింతకీ నువ్వు తిన్నవా శెల్లె? ఇల్లెడు శాకిరి జేత్తవు.తినకుంటే నీర్సమైతవు.నిన్ను సూత్తుంటే తిన్నట్టు లెవ్వు." అన్కుంట లేశి కంచంల టమాట తొక్కు, మావిడి కాయ శెక్క,తియ్యి పప్పు, నెయ్యి ఏసుకొచ్చి శేతికిచ్చింది.
''అమ్మ కడ్పు సూత్తదని ఊకెనలేద్వా!కన్న తల్లోలె పెట్టినవ్!" గుడ్ల నిండా నీళ్లు దిప్పుకున్న అనంతమ్మ తల్కాయ మీద నిమురుతూ " శెల్లే నీ యింటికొత్తే నువ్వు మాత్తరం ఊకుంటవ్వా శెల్లె! ఆడోళ్ళల్లనే అమ్మ మన్సుంటది.అయినోళ్ళు కాకపొయ్యినా తిన్లేదనీ ఊకెనే గమనిచ్చేది అమ్మ మన్సే.
"కడ్పు నిండ తిన్న అనంతమ్మకి "ఏమీ వొండకుండ గియ్యాల రాత్రి ఏం జరుగుద్దో సూడమని శెప్పి బంపింది.
****
''అవ్వోవ్! నువ్వు శెప్ఫినట్లె జేసిన.నన్నెన్ని దిడ్తున్నా శెవిన బెట్టకుంట అటు దిరిగి పడుకున్న.రాత్రంత ఆకలికి అల్లాడిండు.అడ్గదామని నా తాన కొచ్చుడు. అడ్గలేక ఊకుండుడు. గట్ల శానా సయిమం గడిశింది. శిన్నగ నా తానకొచ్చి "అనంతూ! వొంటొండలేదా? అడ్గిండు. నేను సుత శానా సార్లు బతిలాడిచ్చుకొని దేవునర్రల దాశిన బువ్వ కూర గిన్నెలు దెచ్చి పెట్టిన.పొట్లెంగ తిన్కుంట నువ్వు సుత తినమని అన్నడవ్వా!" మురిపెంగ జెప్తున్న అనంతమ్మ వొంక సూస్కుంట...
ఇంగో శెల్లే! ఆకలి కత్తులు నూరితే ఆలితో అలుక తీరుతుందని " ఎన్కటోళ్ళు ఊకెనే అన్లే... అప్పుడప్పుడు గిట్లనే జెయ్యి నీ ఇలువ పేమ తెల్శొత్తది అంటున్న అవ్వ మాటల్కి... ''మా మంచి అవ్వ అన్కుంట దగ్గరికొచ్చి అవ్వ శేతులు ముద్దు బెట్కొని పోయింది.
గదండీ సంగతి! "ఆకలి కత్తులు నూరితే ఆలితో అలుక తీరుతుంది" అంటే గిదే మరి.ఆకలితో పాటు ఆలి ఇలువ తెల్వాలంటే గిట్ల మద్దె మద్దెన శెయ్యాలె.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి