ఎన్నో ప్రశ్నలకు
నిశ్శబ్ద సమాధానంగా....
ఎన్నో సమస్యలకు
నిశ్శేష పరిష్కారంగా....
నింగిని తూర్పున
సడిలేని సందడిగా
నేలను కురిసే తెల్లని
వెలుతురు వానగా....
దివి నుండీ ఒక్కసారిగా
భువికి దిగివచ్చు
కిరణాలు పలికించు
కమ్మని వేదనాదంలా...
గుండెలోని చెదరని
నమ్మకమో బలమో
నడిపించు ఆశలంటి
చురుకైన కాంతిలా....
చెరగని చీకట్లను
దూరంగా తరిమేసి
దారిని సుగమం చేసే
వెలుగిచ్చు దీపంలా...
వాడిన బ్రతుకుల
చిగురింపచేస్తూ....
వాడుకగా ప్రతిదినమూ
వేడుక తెచ్చే వేకువకు
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి