నీటి పరుగుల సరిగమలు
చిన్ని అలల గలగలలు
ఒంగి తాకి పలకరించి
పొంగి పోవు పులకరింపులు
ఇరుగట్లను ఒరుసుకుంటూ
ముచ్చట్లను పంచుకుంటూ
నిలిచి చూచు వీలు లేక
పరుగుతీయు ప్రవాహము
నదీ గమనపు వేగమే
పోలు జీవన గమనం
నడుచు తోవ ఏదైనా
పరుగాపునా సమయము?
నిలువదు ఏ నిమిషమూ
నిన్ను చూసి జాలిపడి
వేడుకైనా వేదనైనా
మారునా దాని వడి?
సాగిన నీటి బిందువైనా
కరిగిన కాలపు క్షణమైనా
మరల మరల కోరినా
తిరిగి పొందగలమా?
నిన్న మరలి రాదు
నేడు నిన్న కాక ముందే
మేలుకొని నడచుకో
రేపు నీది కావాలని కోరుకో!
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి