విష్ణుపురాణంలో 'సౌభరి' అనే తాపసుని వృత్తాంతం వుంది. చాలాకాలం అతడు నీటిలో మునిగి తపస్సుచేస్తుండగా, ఒక నాడు కళ్లుతెరిచి చూసేసరికి ఒక మగచేప, ఒక ఆడచేప, వాటి పిల్లలు నీటిలో ఆనందంగా ఇటూ అటూ సంచరించడాన్ని గమనించాడు.
విలాసంగా విహరిస్తున్న ఆ చేపల కుటుంబాన్ని చూసేసరికి, ఆ తాపసికి గృహస్థజీవితం మీద మక్కువ పుట్టింది. వెంటనే అతడు బయటకి వచ్చి, మాందాత చక్రవర్తి వద్దకు వెళ్లి, అతని కుమార్తెలందర్నీ తన కిచ్చి వివాహం చేయవలసిందిగా కోరాడు. చక్రవర్తి ఇరుకునపడిపోయాడు.
"మహాత్మా! నా తనయలు సమ్మతిస్తే అలాగే వివాహం చేసుకోండి" అన్నాడు రాజు. వెంటనే ఆ ముని, తపశ్శక్తితో అపూర్వ సౌందర్యవంతుడై రాజపుత్రికల దగ్గరికి వెళ్లి అడిగాడు. వారు సంతోషంగా అంగీకరించి వివాహమాడారు.
వివాహానంతరం సౌభరి తన తపశ్శక్తితో వేరు వేరు భవనాలను నిర్మించి, ఒక్కొక్కదానిలో ఒక్కొక్క భార్యను వుంచి వారికి కావలసిన సమస్త విలాసాలు సమకూర్చాడు.
ఇలా చాలాకాలం వారితో భోగాలు, కేళీవినో దాలు అనుభవించాడు. సంతానంకూడా కలిగింది. కానీ ఎన్ని అనుభవించినా అతనికి తృప్తికలగలేదు.
'పుత్రులు కావాలని కోరాను. పుత్రులు కలిగారు. అంతటితో ఆగలేదు. వారి సంతానాన్ని (మనవల్ని) కూడా చూడాలనే తలంపు కలుగుతోంది. ఓహో! మాయ ఎంత బలీయమై నది' అని తలపోసి, భోగాల, ప్రాపంచిక సంపదల క్షణికత్వాన్ని విచారించి, తుట్టతుదకు విరక్తిని పొందాడు.
కాబట్టి సంతుష్టి లేనిదే జీవితం నిరూపయోగమై పోతుంది. సంతుష్టి కలవాడే ధనవంతుడు. అసంతుష్టి కలవాడే దరిద్రుడు.
=================================================
" కావ్యసుధ "
" ఆధ్యాత్మిక సాహిత్య సామ్రాట్"
" ఆధ్యాత్మిక సాహితీ వ్యాస భూషణ్ "
భాగ్యనగరం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి