తనవాడనుకున్న వాడె
పగవాడై పోయి...
శతృవులకుపట్టి యిచ్చినా...!
మోయలేని మృత్యుదూ లాన్ని భుజాన వేసి...
ముళ్ల కీరీటంతలకు బిగించి...
రక్తము చిందే లా కొరడాలతో కొడుతూ...
కొండ నెక్కించి...
కాలకు, చేతులకు మేకులు దిగ గొట్టిన...
యింకా బ్రతికి యుండె నేమో యని...
సూలముతో కడుపులో పొడిచినా....
తండ్రీ ... వీరేమి చేయుచున్నిరో వీ రెరుగరు...
వీ రి పాపములను క్ష మింపుము .. అని ప్రార్ధిం చిన మహా నీయుడా..!
అంత వేదనలోను , పరుల నెవరిని నిందింపక
తండ్రీ నాచేయి యేల విడిచితివి అంటు చింతించిన మహోన్నతుడా...!
తనను తాను ఏనాడు దేవునిగా ప్రకటింపక....
దైవ కుమారుని గానే ఎ రిగించిన మహాత్ముడా...
నిన్ను నిన్నుగా తెలుసు కున్న దెవరు...!?
"నీవలే నీ పొరుగు వారినీ ప్రేమింపుము"
అని నీవు చెప్పిన దానిని ఆచరించి నిన్ననుసరించు వారేరీ...!
క్షమా గుణమునకు ప్రతి రూప మైన నీవు...
దయతో మా తప్పులను మన్నింపుము !!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి