వికారాబాద్ జిల్లా బంటారం మండలం సల్బాతా పూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. గత 20 సంవత్సరాల తర్వాత ఈ వార్షికోత్సవాన్ని నిర్వహించడం విశేషంగా నిలిచింది. గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని అభినందించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూరు సిద్ధార్థ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నరేందర్ గారు హాజరై మాట్లాడుతూ, ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవం నిర్వహించడం గొప్ప విషయమని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసి, సమాజానికి ఉపయోగపడే మానవ వనరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. విద్యార్థులు స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రశంసిస్తూ, ఉపాధ్యాయులను అభినందించారు.జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కే. గోవిందరావు మాట్లాడుతూ, విద్య హక్కు చట్టం ప్రకారం ప్రతి పిల్లవాడికి చదువు కునే హక్కు ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని పేర్కొన్నారు.
కవయిత్రి మొల్ల కళావేదిక ఫౌండర్ అధ్యక్షులు కేడియం వెంకట్ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థిలో ప్రతిభ దాగి ఉంటుందని, దాన్ని వెలికి తీసి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని తెలిపారు.
అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:
హెడ్ మాస్టర్: కె.బి. నాగజ్యోతిఉపాధ్యాయులు: సి. వెంకటేశం, ఎన్. విశాల్సర్పంచ్: బి. బాలయ్యఉప సర్పంచ్: ఎం. నరేందర్ రెడ్డి
మాజీ ఎంపీటీసీ: అల్లపురం సంధ్యారాణి నాయకులు బి. అనంతయ్య అంగన్వాడీ ఉపాధ్యాయులు: స్వరూప, ప్రమీల
హై స్కూల్ ఇన్‌చార్జ్ హెడ్ మాస్టర్: కె. జంగయ్య,ఉపాధ్యాయుడు. రఘురా0,పాత్రికేయ మిత్రుడు(పూర్వ విద్యార్థి) అల్లపురం అంజిలయ్య విద్యార్థులు పేరెంట్స్ పాల్గొన్నారు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి