"మోదుగ మొగ్గలు"ఆవిష్కరణ
 ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం లోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల పొన్నారి లో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయురాలు గౌడి సరిత ఐదవ,నాలుగవ తరగతి పిల్లలను ప్రోత్సహించి,మార్గదర్శనం చేస్తూ రాయించిన  గేయాల సంకలనం "మోదుగ మొగ్గలు" ఈ పుస్తకాన్ని ఇటీవల  జిల్లా కలెక్టర్ శ్రీ రాజర్షి షా  గారు ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు శ్రీ మతి సుజాత ,  ఉపాధ్యాయులుసాహితీ వేత్త గౌరవ శ్రీ ఉదారినారాయణ ,కవయిత్రులు,ఉపాధ్యాయులుశ్రీమతి.మ పైడి నవనీత 
శ్రీ మతిస్వాతి శ్రీకాంత్ బోడిగాం  విద్యార్థులు వారి పోషకులు గ్రామస్థులు , పాత్రికేయులు పాల్గొన్నారు.

ఈ పుస్తకం లో 62  గేయాలున్నాయి.  5 మంది విద్యార్థులు రాసారు.వారు బెండ వేదిత,అంగలి క్రాంతిక చరిత మాక్నూరి,  బెండ విషిత,షేక్ సన అనే విద్యార్థులు రాసారు.ప్రాథమిక పాఠశాల పొన్నారిలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు శ్రీమతి గౌడి సరిత గారి మార్గదర్శకత్వం లో ప్రాథమిక పాఠశాల పొన్నారి ఆవరణలోమోదుగ మొగ్గలు (పొన్నారి పిల్లల గేయాలు ) పేరుతో కలెక్టర్ రాజర్షి షా గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ పుస్తకం లో మొత్తం 62 గేయాలు ఉన్నాయి.మన పండుగలు సంప్రదాయాలు గణపయ్య, బతుకమ్మ, సవార్ల పండుగ, మన సంస్కృతి, తెలుగు భాష జాతీయ నాయకులు అంబేద్కర్ గాంధీజీ చాచాజీ ,అమ్మ, నాన్న, గురువు దోస్తులు, తెలంగాణ వంటకం బూరెలు ఇలా విభిన్న రకాల అంశాలపై చక్కగా రాసినందుకు కలెక్టర్ గారు అభినందించారు. తమ పిల్లలను ప్రోత్సహించి వారి లోని  సృజనను వెలికి తీసినందుకు తల్లి దండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ,ప్రశంసించారు.

కామెంట్‌లు