సామెత -184: *ఆలినిడిచినోడు హరిదాసు -సంసారం విడిచినోడు సన్యాసి
*****
"అవ్వా! సంకురేతిరి ఇప్పుడా అప్పుడా ఇంకార్నెల్లు పైంగనే గద ఉంది. మన రాందాసు మావఁ కొడుకు కిట్టదాసుని సూత్తున్నవా! రాందాసు మావఁ సంకురేతిరప్పుడు ఇల్లిల్లూ చిడతలు అచ్చయ పాత్ర పట్టుకొని తిర్గుతుంటే మస్తు నాదాను పడ్డడు.ఇంట్లె దినాం గిది నీకు ఎందుకనుడు? హరిదాసు ఏశం గట్కొని ఎల్లకు నాయినా! అని సతాయిచ్చిండు. గిప్పుడేమో...
గిప్పుడు గా కిట్టదాసు ఏంజేత్తుండు శెల్లే? గక్కన్నే ఆగిపోతివి. రాందాసు మావఁ వత్తువులన్నీ ఎవలకన్న ఇచ్చిండా ఏంది? గా కిట్ట దాసుకెందుకో గని హరిదాసు అన్న మాటే మొదగాల నించి ఇట్టపడడు.
"అవ్వోవ్! గదొకప్పటి సంగతి గీ నడ్మల తెల్లారగట్ల సుక్కమ్మత్తింటికి పాలకి బోతున్ననా! గా సయిమంలో "అరిలో రంగ అరి" అన్కుంట పాటలు నేర్సుకుంటుండవ్వా! గిదెక్కడి ఇచ్ఛింత్రం గా మాటే వొల్లనోడు,గా వుర్తే నచ్చనోడు ఎందుకిట్ట శేత్తుండో సమజ్ గాలే. గందుకే గీ ముచ్చెటి నీ శెవులెయ్యడానికి వొచ్చినవ్వా!"
'గింతకీ ఆడి పెండ్లాం ఉందా శెల్లే! ఇద్దరి నడ్మల రసరసైతుందని, దాన్ని తిట్టి కొట్టి పుట్టింటికి పంపిండని తెల్శింది."
"అవునవ్వా! శానా మెతక పొల్ల.గస్మంటి నోరూ వాయీ లేనిదాన్ని కన్న కట్టాలు బెట్టి పుట్టింట్లె తోలొచ్చిండు. ఎప్పుడు తోల్కొత్తడో ఏమో!సయిమానికి తిండి లేక రాందాసు మావఁ మస్తు అవత్త పడ్తుండు.గదే అత్త బతికుంటే గీ కట్టమొచ్చునా? పాపం అన్పిస్తది మావఁను సూత్తుంటే...
"అవును శెల్లే! గీ కిట్టిగాని రంది సుతనాయె. ఇంగెట్లుంటడు?గా సన్యాసి గాని సోపతి ఎప్పుడైతే పట్టిండో గప్పట్నించి గీ కిట్టిగాడు అట్ల తయారైండు.
"ఎవడవ్వా! గా రోశయ్య సోపతేనా?"
"అవును శెల్లే! గీని కన్న పిల్లపీసు లేరుగని,గాడికి ఎదిగిన బిడ్డలు,అమ్మా నాయిన అందరున్నరు.గాల్లందర్నొదిలేసి గా రంగు బట్టలేస్కొని "ఇల్లు మాయ - పిల్లలు మాయ"అన్కుంట తిర్గుతుండు."
"బానే ఉంది కత.గిదంత దెల్వదవ్వా! గీడేమో పెళ్ళాన్ని వొదిలేశిండు. గాడేమో పెళ్ళాం పిల్లలు ఇల్లాకిలి వొదిలేశిండన్న మాట."
" గందుకే గాల్లిద్దర్ని జూసి పతొక్కరు ఆలినిడిశినోడు హరిదాసు - సంసారం యిడిశినోడు సన్యాసి " అని కొత్త మాట అనబట్టిరి."
హరిదాసు గావాల్నంటే పెళ్ళాన్ని వొదిలేయేలా అవ్వా?"
"ఎవ్వలూ వొదిలేయరు శెల్లే! ఎవ్వలో కొందరు ఎన్కట ఉండేటోళ్ళు. గిస్మంటోళ్ళని కొత్త రకపోళ్ళని అనొచ్చు శెల్లే!"
"అవునా అవ్వా! భలే ముచ్చెటి జెప్పినవ్. ఓ పక్కన నవ్వొత్తాంది.మరో పక్కన కోపమొత్తాంది.
"ఓపాలి రాందాసు మావఁని పల్కరిచ్చి రావాలె." ఇంగ ఎల్తవ్వా!
"నేను సుత వత్తనుండు మావకి నాల్గు దైర్యపు మాటలు శెప్పిరావాలె."
గదండీ సంగతి! ఆలినిడిచినోడు హరిదాసు - సంసారం యిడిశినోడు సన్యాసి '' అంటే గిదే మరి. గా కిట్టదాసు ,గీ రోశయ్య గస్మంటోల్లే! గస్మంటోళ్ళ నా శకలు సూశే గిస్మంటి సామెతలు బుట్టేది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి