చెప్పేది చెవి నేసుకోండి. ఇంట్లో పిల్లి
దూరిందని ఇంటికి నిపెట్టుకుంటామా
మనిషికి,,ఆంగలార్చుతాడు
అన్నిటికీ.ఎండంటే వడ అంటాడు.
వానంటే జలుబంటాడు.
మంచు వస్తే
ముడుచుకుంటాడు.
ఎట్లా మనిషితో వేగేదిరా బాబు అంటున్నాది
ప్రకృతి.
అరు రుతువులు
తమ తమ ఋతు ధర్మాలను
సక్రమ పద్ధతిలో
ఉపక్రమించి పరిక్రమించక ఉంటే
పరిస్థితి విషమం కాదా?
దడతగ్గించుకోండి.
ఎండ మండుతుందని తెలుసు.
చెండ ప్రచండ రవి
రుచులు చవిచూస్తూనే ఉన్నాముగాప్రతి
గ్రీష్మంలో.
అందుకేముందుగా
అందరం ఆచరిస్తాం అతిజాగ్రత్తలు.
కాగితం మీద కాదు కంటి చూపుకందినంత
అందిద్దాంసహాయం.
ఎలాగంటారా?
ఇలా,
నీళ్ల మజ్జిగలో ఉప్పు కలిపి నిమ్మరసం
చేర్చి ప్రతి ఒక్కరూ జేబులో పర్సు
లాగే బయట కాలు మోపేటప్పుడు
పదిలంగా చేకూర్చుకోవాలి.
అవసరమా అడుగు బయట పెట్టు.
పొద్దున 11 నుంచి సాయంత్రం నాలుగు దాకా
ఇల్లే శ్రీరామరక్ష రోడ్లపై మీ వాహనాలు,కావవి కాలే కొలుములు.
. కబళిస్తాయి మీ ఒంట్లో నీటిని.
అవి పోతే మీకు మిగిలేది వడ.
అదే ఎండ వడ.
ప్రకృతిప్రతాపాలకు తట్టుకోవడం కష్టమే.
కానీ ఎన్నో కష్ట నష్టాలను ఇష్టాలుగామార్చుకునే
మనిషి ఓర్చుకోవాలి ప్రకృతి ప్రతాపాలకు. సమశీతోష్ణస్థితి
ఉన్న దేశం మనదే. అందుకు మనం అదృష్టవంతులం.
మంచుముద్దల దేశాలు కొన్ని మరికొన్ని పంటలు,
ఎండలమంటలకు మాడిపోకుండా
పైన పందేళ్లువేయాల్సిన దేశాలు కొన్ని.
దాతలుచలివేంద్రలు నడపడం,
అంగళ్ళవాళ్ళు సొంత లాభం కొంత మానుకొని
లేదా లాభం మీద మరింత లాభం వేసుకొని
అంగడికి వచ్చిన వారికి ముందుమంచినీళ్లు
లేదా మజ్జిగఇవ్వండి ఆ పుణ్యం మీకు ఏ ప్పటికే ఉంటుంది.
రెండు నెలలుజాగ్రత్తగా
ఉంటే జీవితం నందనవనం
ఎండకాస్తే,కొండంతలాభం.
మనఅండగా ఉండే ఎండబంగారుకొండ.
అదిలేక వాన
లేదు.వానలేక మన
హరితవర్ణం మారు
శ్వేతమై
అందుకే కావాలి ఎండ.
మనం వడ తినకుండా
అదే మనకు వడతగలకుండా

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి